Viral Video: పాత బిల్డింగ్ పడగొడుతుండగా ఊహించని ప్రమాదం.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

నిర్మాణ కార్మికుడు పని చేస్తుండగా గోడ, పైకప్పు కూలి శిథిలాల్లో పడిపోయాడు. చావు అంచుల దాకా వెళ్లినప్పటికీ, కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా బయటపడటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు అతడిని 'సూపర్‌మ్యాన్' అని పిలుస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర పనుల్లో భద్రతా చర్యలు తప్పనిసరి అని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తుంది.

Viral Video: పాత బిల్డింగ్ పడగొడుతుండగా ఊహించని ప్రమాదం.. చివరికి షాకింగ్ ట్విస్ట్!
Miraculous Escape Worker,

Updated on: Aug 13, 2026 | 4:01 PM

Viral Video: సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ నిర్మాణ కార్మికుడికి సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంటి పైకప్పుపై పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ, పైకప్పులోని కొంత భాగం కూలిపోవడంతో ఆ కార్మికుడు శిథిలాల్లో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ కొద్దిసేపటి తర్వాత అతడు శిథిలాల నుంచి బయటకు రావడంతో వీడియో చూసిన వారు ఊపిరి పీల్చుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ కార్మికుడు ఇంటి పైకప్పుపై గోడకు ఆనుకుని కూర్చుని పని చేస్తున్నాడు. అతడు పైకప్పులోని ఓ భాగాన్ని పడగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కొంతసేపు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని కొనసాగించాడు. ఇంతలో అతడు తవ్వుతున్న ప్రాంతంలోని నిర్మాణం ఒక్కసారిగా బలహీనపడి కూలిపోయింది. క్షణాల్లోనే గోడ, పైకప్పులోని కొంత భాగం పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది. భారీగా శిథిలాలు కిందపడటంతో అక్కడ దుమ్ము మేఘంలా వ్యాపించింది. అదే సమయంలో కార్మికుడు కూడా శిథిలాలతో పాటు కిందకు జారిపోయాడు. దుమ్ము కారణంగా కొద్దిసేపు అతడు కనిపించకుండా పోయాడు. దీంతో వీడియో చూస్తున్న వారికి అతడి పరిస్థితిపై ఆందోళన కలుగించింది.

అయితే కొద్దిసేపటి తర్వాత దుమ్ము తగ్గడంతో కార్మికుడు శిథిలాల మధ్య నుంచి పైకి లేవడం కనిపించింది. అతడు తేరుకుని తనను తాను నిలబెట్టుకుని, అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. చివరకు తన కాళ్లపై నిలబడటంతో అతడు తీవ్ర ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు స్పష్టంగా తెలియదు. అలాగే కార్మికుడికి ఏమైనా గాయాలయ్యాయా అనే సమాచారం కూడా అందుబాటులో లేదు.

వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. కొందరు అతడిని “ఇండియన్ సూపర్‌మ్యాన్”, “ఇండియన్ స్పైడర్‌మ్యాన్” అంటూ పోల్చారు. మరికొందరు “10 రోజుల పని ఒక్క రోజులో పూర్తయింది”, “సూపర్‌హీరో ల్యాండింగ్”, “007 జేమ్స్ బాండ్” అంటూ కామెంట్లు చేశారు. అయితే మరికొందరు మాత్రం నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చివరికి ప్రమాదం నుంచి కార్మికుడు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, ఇలాంటి పనుల్లో నిపుణుల పర్యవేక్షణ, రక్షణ పరికరాల వినియోగం ఎంతో అవసరమని పలువురు పేర్కొంటున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us