Viral Video: చిరుత వేగం ముందు ఎవ్వరైనా దిగదుడుపే.. వేట మామూలుగా లేదుగా..!

Viral Video: చిరుత వేగం మామూలుగా ఉండదు. భూమిపై నివసించే అత్యంత వేగవంతమైన జంతువు ఇదే. దీని కన్ను పడిందంటే ఆ జంతువు ఆ

Viral Video: చిరుత వేగం ముందు ఎవ్వరైనా దిగదుడుపే.. వేట మామూలుగా లేదుగా..!
Cheetah Attack

Updated on: Apr 30, 2022 | 11:09 AM

Viral Video: చిరుత వేగం మామూలుగా ఉండదు. భూమిపై నివసించే అత్యంత వేగవంతమైన జంతువు ఇదే. దీని కన్ను పడిందంటే ఆ జంతువు ఆహారం కావాల్సిందే. చాలా ప్రమాదకరమైన జంతువు. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. దాని వేగం ముందు ఎవ్వరైనా దిగదుడుపే. నేడు ప్రపంచంలో చాలా తక్కువ చిరుతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాస్తవానికి అడవి జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. సోషల్ మీడియాలో వేటకి సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇందులో చిరుత వేటకి సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా చూస్తారు. తాజాగా ఒక చిరుత.. జింకని వేటాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక చిరుత జింక వెంబడి పరుగెత్తడం చూడవచ్చు. ఇందులో మనం చిరుత వేగాన్ని గమనించవచ్చు. కానీ జింక వేగం చిరుత ముందు పనిచేయదు కదా.. దీంతో చిరుత తన పంజాతో జింకని అదిమి పట్టుకుంటుంది. ఒక్కసారి చిరుతకి చిక్కితే సజీవంగా బయటికి వెళ్లడం అసాధ్యం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. కేవలం 16 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 25 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వేలాది మంది ప్రజలు వీడియోను లైక్ చేసి వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోస్‌కి ఇక్కడ క్లిక్ చేయండి

Sunrise Points: ఈ ప్రదేశాలలో సూర్యోదయాన్ని చూస్తే మైమరచిపోతారు..!

Education Loan: ఈ బ్యాంకులు చౌకైన విద్యా రుణాలు అందిస్తున్నాయి.. ఈఎంఐ ఎంతంటే..?

IPL 2022, Purple Cap: యుజ్వేంద్ర చాహల్ నెంబర్ వన్.. టాప్ 5లో పంజాబ్-రాజస్థాన్ బౌలర్లు ఎవరూ లేరు..!