Viral‌: జైలు‌లోని ఖైదీతో ఇద్దరు యువతుల శృంగారం.. కట్ చేస్తే చివరికి సీన్ రివర్స్..

|

Aug 24, 2022 | 1:15 PM

టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి.. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓ ఇద్దరు యువతులు..

Viral‌: జైలు‌లోని ఖైదీతో ఇద్దరు యువతుల శృంగారం.. కట్ చేస్తే చివరికి సీన్ రివర్స్..
Jailer
Follow us on

టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి.. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓ ఇద్దరు యువతులు.. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని ప్రేమించారు. ఆ వ్యక్తితో వీరిద్దరూ శారీరిక సంబంధాన్ని కూడా పెట్టుకున్నారు. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో సీన్ కాస్తా రివర్సయింది. బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటన వెనుక అసలు కథేంటంటే..?

వివరాల్లోకి వెళ్తే.. వేల్స్‌లోని బ్రిడ్జెండ్ జైలులో ఆలిస్ హిబ్స్ అనే యువతి నర్సుగా, రూత్ ష్మా అనే యువతి జైలు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమలో పడ్డారు. అంతేకాదు అతడితో శారీరిక సంబంధాన్ని కూడా పెట్టుకున్నారు. అంతా తాము అనుకున్నట్లుగానే జరుగుతోందని భావించిన ఆ ఇద్దరికీ ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. విషయమంతా పై అధికారులకు తెలియడంతో ఈ ఇద్దరు యువతులను అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు.

కాగా, ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. యువతులిద్దరూ బాధ్యతాయుత ఉద్యోగాలు చేస్తూ.. ఖైదీతో శారీరిక సంబంధాన్ని పెట్టుకుని జైలు వ్యవస్థను అపహాస్యం చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వాదోపవాదనలు విన్న కోర్టు.. విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..