సాధారణంగా రెండు వేరు వేరు జాతులకు చెందిన జంతువులు కలిసి కట్టుగా అస్సలు ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఎంతటి బద్ద శత్రువులైన ప్రాణ స్నేహితులుగా మారిపోతుంటాయి. ఉదాహరణ… ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో కుక్క పిల్లి, కుక్క కోడి, కోడి పిల్లి, కోతి కుక్క, కోతి పిల్లి స్నేహాం ఆకట్టుకుంటుంది. అలాగే.. కోతి.. తాబేలు స్నేహాన్ని ఎప్పుడైనా చూశారా ?. కేవలం స్నేహమే కాదండోయ్.. ఏకంగా తాబేలు ఆకలి తీరుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో రెండు కోతులు.. ఓ తాబేలు జూపార్కులో ఉన్నాయి. అయితే అక్కడే ఉన్న ఓ కోతి చేతిలో ఆపిల్ పట్టుకుని తింటూ కూర్చుంది. అంతేకాదు.. తన పక్కనే ఉన్న తాబేలు సైతం తినిపిస్తుంది. ఇక ఆ తాబేలు కూడా కోతి తినిపించే ఆపిల్ ను తింటుండగా.. ఒకదాని తర్వాత మరొకటి నిదానంగా.. ఎంతో అన్యోన్యంగా ఆపిల్ తింటూ కూర్చున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ క్యూట్ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
Also Read: Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..
RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు