Video: రక్తం ఏరులై పారుతోందా? ఎర్రగా మారిన వాగు.. షాకైన స్థానికులు!

Turkey Stream Turns Bright Red : ప్రకృతిలో ఎన్నో వింతలు కనిపిస్తుంటాయి. తాజాగా టర్కీలో జరిగిన ఓ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. అక్కడ ఓ వాగు నీరు ఒక్కసారిగా ఎర్రటి రంగులోకి మారిపోయింది. సాధారణంగా ప్రవహించే నీరు ఇలా రక్తం రంగులో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Video: రక్తం ఏరులై పారుతోందా? ఎర్రగా మారిన వాగు.. షాకైన స్థానికులు!
Turkey Stream Turns Blood Red Locals Scared

Updated on: Nov 25, 2026 | 10:17 AM

Turkey Stream Turns Bright Red:  సాధారణంగా నీరు పారాల్సిన వాగులో ఎర్రటి రంగు నీరు ప్రవహిస్తే ఎలా ఉంటుంది? చూస్తున్నవారికి ఒక్కసారిగా రక్తం పారుతోందా అనే అనుమానం కలగకమానదు. టర్కీలో ఓ వాగు నీరు అకస్మాత్తుగా ఎరుపు రంగులోకి మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

టర్కీలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న రైజ్ (Rize) నగరంలో నవంబర్ 21, 2026న ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి డెగిర్మెండెరే (Değirmendere) వాగు నీరు ఒక్కసారిగా ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారిపోయింది. నివాస ప్రాంతాల మధ్యుగా ప్రవహించే ఈ వాగులో ఎర్రటి నీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

నీటిలో నిజంగానే రక్తం కలిసిందా?

వాగు నీరు రక్తం మాదిరిగా ఎర్రటి రంగులో కనిపించడంతో స్థానికుల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాగులో రక్తం పారుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నీరు ప్రవహించే వాగు ఒక్కసారిగా ఎర్రటి రంగులోకి మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే దీని వెనుక అతీంద్రియ శక్తులు ఉన్నాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొందరు ఇది భారీ పర్యావరణ విపత్తుకు సంకేతమా అని ఆందోళన చెందారు. వాగులో ప్రవహిస్తున్న ఎర్రటి నీటికి సంబంధించిన వీడియోలు చూపరులను ఆకట్టుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

WATCH: Turkey Stream Turns Bright Red, Viral Video Leaves Internet Stunned as Pollution Probe Begins

వీడియోపై నెటిజన్ల రియాక్షన్స్‌!

వాగు నీరు రక్తం రంగులోకి మారిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ దృశ్యాలు హారర్ సినిమాను తలపిస్తున్నాయంటూ కొందరు కామెంట్స్ చేసారు. ‘నిజంగానే రక్తపు ఏరు పారుతున్నట్లుగా అనిపిస్తోంది’, ‘హారర్ సినిమాలోని సన్నివేశంలా ఉంది’, ‘ప్రకృతి ఇలాంటి దుస్థితిలో కనిపించకూడదు’, ‘వీడియో నమ్మశక్యంగా లేదు ఓ వాగు నీరు ఇంతలా రంగు మారడం ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్లు పెట్టారు. వాగు నీరు ఎర్రగా మారిన దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసాయి.

వాగులోకి ఎర్రటి నీరు ఎలా వచ్చింది?

అసలు వాగు నీరు ఇలా రంగు మారడానికి కారణమేంటని అధికారులు ఆరా తీశారు. విచారణలో ఓ ప్రైవేటు టీ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్వాకం బయటపడింది. ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా వాగులోకి విడుదల చేసారు. ఈ వ్యర్థాలు నీటిలో కలవడంతోనే వాగు రంగు ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారింది. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి వ్యర్థాలను నీటిలోకి వదిలిన ఫ్యాక్టరీపై జరిమానా విధించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.

నల్ల సముద్రానికి ముప్పు తప్పదా?

డెగిర్మెండెరే వాగు జనావాసాల మధ్యుగా ప్రవహించి చివరకు నల్ల సముద్రంలో కలుస్తుంది. దీంతో వాగులో కలిసిన పారిశ్రామిక వ్యర్థాలు సముద్ర జలాలను కూడా కలుషితం చేసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయకుండా నీటి వనరుల్లోకి వదిలితే ఎంతటి పర్యావరణ ముప్పు ఎదురవుతుందో ఈ ఘటన గుర్తుచేస్తోంది

Loading...
Unable to load recommendations.
Follow Us