Trending: ఆటో అన్న పజిల్.. మినిమం డిగ్రీ అవసరం లేదు.. మీరు చెప్పగలరా..?

మీరు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు.. పక్కన లేదా ఎదురుగా వెళ్తున్న ఆటోలను గమనించండి. ఏదో ఒక ఆటో మీద పక్కాగా ఓ కొటేషన్ కనిపిస్తుంది. ప్రేయసిని తలుచుకుంటూ కొందరు... అమ్మ ప్రేమను వివరిస్తూ కొందరు.. అమ్మాయిల మోసాన్ని వివరిస్తూ కొందరూ కొటేషన్స్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు నయా ట్రెండ్ వచ్చింది. అదే పజిల్స్ విసరడం....

Trending: ఆటో అన్న పజిల్.. మినిమం డిగ్రీ అవసరం లేదు.. మీరు చెప్పగలరా..?
Puzzle On Auto
Follow us

|

Updated on: Apr 19, 2024 | 4:39 PM

మీరు ఆటోలపై ఉండే కొటేషన్స్ ఎప్పుడైనా చదివారా…? వారి క్రియేటివిటీ మాములుగా ఉండదు. ముఖ్యంగా లవ్, లైఫ్‌కి సంబంధించిన కొటేషన్స్‌ విషయంలో వాళ్ల తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. “పదే, పదే నిమిషాలు కూర్చుంటావు.. పదే, పదే గుర్తొస్తావు”, “చేప ఈత మరిచినా, నెమలి నాట్యం మరిచినా, నేను నిన్ను మరవను” అని రాసి ఆటోలో ఎక్కే కాలేజ్ అమ్మాయిలను ప్లర్ట్ చేస్తూ ఉంటారు కొందరు. ‘అమ్మాయి చేతిలో చిక్కుకోవడం కంటే.. చచ్చి చితికి పోవడమే మేలు’ అంటూ ధ్యాన బోద కూడా చేస్తారు మరొకరు. ఇలా ఎవరి వెర్షన్ వారిది. తాజాగా ఓ ఆటో అన్న జనాలకు ఓ పజిల్ విసిరాడు. A, B, C, D అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చి.. పక్కన యాపిల్ సింబల్స్ వేశాడు. అయితే దీని వెనుక ఏదో మతలబు ఉందని అందరూ అనుకుంటున్నారు. అదేం అవసరం లేదు. దీన్ని సాల్వ్ చేయాలంటే మినిమం డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు.

A. యాపిల్ B. బడా యాపిల్ C. చోటా యాపిల్ D. దో యాపిల్

అదన్నమాట సంగతి. పజిల్ విసిరాడు కానీ.. మరి కష్టమైంది అయితే ఏం కాదు. ఇంత ఈజీ పజిల్‌ను దాని వెనుక ఏదో ఉందని.. క్రాక్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు కొందరు. Aఏక్.. B బడా… C చోటా..D దో..  ఈ ఆన్సర్ కూడా కరెక్టే.  ఇలాంటి ట్రెండీ పజిల్స్ మీ ముందుకు తీసుకొస్తాం.. అందు కోసం టీవీ9 ట్రెండీ పజిల్ మీద ఓ లుక్కేసి ఉంచండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..