Watch Video: లోకల్‌ ట్రైన్‌లో రెచ్చిపోయిన లేడీస్‌.. ఆంటీ, అమ్మాయిల ఫైట్‌ వీడియో హల్‌చల్‌

|

Oct 18, 2022 | 4:49 PM

ఈ వీడియోలో ముగ్గురు మహిళలు కిక్కిరిసిఉన్న లోకల్‌ ట్రైన్‌ కోచ్‌లో ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని లాగుతుండటం కనిపించింది.

Watch Video: లోకల్‌ ట్రైన్‌లో రెచ్చిపోయిన లేడీస్‌.. ఆంటీ, అమ్మాయిల ఫైట్‌ వీడియో హల్‌చల్‌
Three Women Fighting
Follow us on

గత కొద్ది రోజులుగా ముంబై లోకల్‌ ట్రైన్‌లో అనేక చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. లోకల్‌ ట్రైన్‌లో మహిళా ప్రయాణికుల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ముగ్గురు మహిళలు ముంబై లోకల్‌ ట్రైన్‌ లేడీస్‌ కోచ్‌లో సిగపట్లకు దిగిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లోకల్ ట్రైన్‌లో ముగ్గురు మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకుంటూ పాశవికంగా పోరాడుతున్న దృశ్యాలు నెటిజన్లను సైతం షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. రోడ్స్‌ ఆఫ్‌ ముంబై పేజ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన 31 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా వీక్షించగా 800 రీట్విట్స్‌ అయ్యాయి. ఈ వీడియోలో ముగ్గురు మహిళలు కిక్కిరిసిఉన్న లోకల్‌ ట్రైన్‌ కోచ్‌లో ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని లాగుతుండటం కనిపించింది.

వైరల్‌ అవుతున్న వీడియోలో తొలుత ఓ అమ్మాయి మహిళను కొడుతూ తోసివేస్తుండటం కనిపించింది. ఆపై మరో మహిళ జోక్యం చేసుకుని అమ్మాయిపై దాడికి దిగింది. ట్రైన్‌లో ఉన్నవారు ముగ్గురిని ఆపేందుకు విఫలయత్నం చేశారు. అరే ఆంటీ వదలండి అంటూ..  ఓ ప్రయాణీకురాలు అరుస్తుండటం కూడా వీడియోలో వినిపించింది. మరికొందరు ప్రయాణీకులు తమ సీట్లలో కూర్చుని గొడవ జరుగుతున్నా మౌనంగా చూస్తుండిపోయారు. అయితే, వీరి గొడవకు గల కారణాలు తెలియరాలేదు. ముగ్గురు మహిళలు ఒకరికొకరు పరిచయస్తులా..? లేదంటే అపరిచితులా..? అన్నది కూడా తెలియదు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఇలాంటి సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గత నెలలోనూ ఇదే తరహా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. థానే-పన్వేల్‌ లోక్‌ల్‌ ట్రైన్‌లో సీటు విషయంలో మహిళలు బాహాబాహీకి దిగిన వీడియో వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఘర్షణను నివారించేందుకు జోక్యం చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి