Viral Video: ఆలయంలో హారతి సమయంలో ఎలుక ప్రత్యక్షం.. చప్పట్లు కొడుతూ భజన.. వీడియో వైరల్

అనేక దేవాలయాలలో భగవంతుడికి ఉదయం, సాయంత్రం హారతి ఇస్తారు. ఈ హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొంటారు, చప్పట్లు కొడుతూ హారతి పాట పాడుతూ ఉంటారు. అయితే ఎలుక హారతి సమయంలో ఓ భక్తుడిలా చప్పట్లు కొడుతూ తాదాత్మత చెందడం ఎవరైనా ఎప్పుడైనా చూసారా? అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

Viral Video: ఆలయంలో హారతి సమయంలో  ఎలుక ప్రత్యక్షం.. చప్పట్లు కొడుతూ భజన.. వీడియో వైరల్
Viral Video

Updated on: Jul 10, 2023 | 12:19 PM

భారతదేశం ఆధాత్మిక ప్రదేశం. వింతలు విశేషాలతో సైన్స్ చెందించని రహస్య దేవాలయాలకు నెలవు. దేవుడున్నాడని నమ్మి విశ్వసిస్తారు. దైవాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తమ ప్రతి సుఖ దుఃఖాల్లో కూడా భగవంతుడు తోడున్నాడని స్మరిస్తారు. దేశంలోని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఉన్న దేవాలయాలకు వెళ్లి భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అనేక దేవాలయాలలో భగవంతుడికి ఉదయం, సాయంత్రం హారతి ఇస్తారు. ఈ హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొంటారు, చప్పట్లు కొడుతూ హారతి పాట పాడుతూ ఉంటారు. అయితే ఎలుక హారతి సమయంలో ఓ భక్తుడిలా చప్పట్లు కొడుతూ తాదాత్మత చెందడం ఎవరైనా ఎప్పుడైనా చూసారా? అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

వాస్తవానికి ఈ వీడియోలో ఒక ఎలుక ఆలయం వెలుపల నిలబడి ఉంది. తన ముందు కాళ్లతో చప్పట్లు కొట్టడానికి ప్రయత్నిస్తున్న మానవుడిలా భజన చేస్తోంది. ఆ ఎలుక ఎలా భక్తిలో మునిగిపోయిందో వీడియోలో చూడొచ్చు మహారాష్ట్రలోని ఓ ఆలయంలో ఆరతి సమయంలో ఈ ఎలుక ఎప్పుడూ చప్పట్లు కొడుతూ కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఈ అద్భుత ఘటనను తన సెల్ ఫోన్ లోని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొద్ది సేపటికే వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుహిచాహియే అనే ఐడితో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 1 లక్ష 95 వేల కంటే ఎక్కువ వ్యూస్ ను, అయితే 25 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

అదే సమయంలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. ఒకరు ఇలా వ్రాశారు.. ‘నేను దేవుని ఆలయంలో ప్రాంగణంలో జంతువులను చూశాను..  భక్తిగా భజన చేయడం చాలాసార్లు చూశాను, ఎందుకంటే ఇది శాశ్వతమైన సత్యం’ అని మరొకరు రాశారు, ‘ఈ ప్రేమ, భక్తి అద్భుతమైనది’. అదేవిధంగా మరొకరు, ‘భక్తి చేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు నాకు అర్థమైంది’ అని కామెంట్ చేశారు.

టీవీ9 ఈ వైరల్ వీడియోను ధృవీకరించనప్పటికీ వైరల్ అవుతున్న వీడియో ఈ న్యూస్ ను పాఠకులకు అందిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us