టీవీ ప్రోగ్రామ్స్ చిరాకు తెప్పిస్తున్నాయా.? వెబ్ సిరీస్‌లు బోర్ కొట్టించాయా.? ఆఫీస్ వర్క్ కంగారు పుట్టిస్తోందా.? అయితే టెన్షన్ వద్దు.. మీ మెదడు చురుగ్గా ఉండేందుకు.. కళ్లకు పదును పెట్టేందుకు సరికొత్త ఫోటో పజిల్‌తో వచ్చేశాం. ఇది కచ్చితంగా మిమ్మల్ని కిక్కేస్తుంది. మరి లేట్ ఎందుకు అదేంటో చూసేద్దాం..
సాధారణంగా ఫోటో పజిల్స్‌ను ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఈ మధ్య ఇంటర్నెట్ వాడకం పెరిగిన దగ్గర నుంచి పజిల్ లవర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది తమ రిలాక్సేషన్ టైంను బోర్ కొట్టకుండా గడిపేందుకు ఫన్‌తో పాటు కాస్త సవాల్‌ను కూడా కావాలనుకుంటున్నారు. అలాంటివారి కోసమే ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట చాలానే ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్ని సాల్వ్ చేయడంలో నూటికి 99 శాతం మంది పప్పులో కాలేశారు.
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? చూసిన వెంటనే అది అడవిలో తీసి ఉంటారని చెప్పేయొచ్చు. అవును మీ గెస్ కరెక్టే.! అటవీ ప్రాంతంలో తీసిన ఈ ఫోటోలో ఓ చిరుత దాగుంది. మేబి.. ఆ చెట్టు కొమ్మల అవతల.. లేదా ఆ చెట్టుపైన చిరుత ఉండొచ్చు. అదెక్కడుందో సరిగ్గా చెప్పాలి. మీ కళ్లకు పరీక్షను పెడుతుంది ఈ పజిల్.. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మీ టర్న్ వచ్చింది. చిత్రాన్ని పైపైన చూస్తే మీకు చిరుత కనిపించదు. క్షుణ్ణంగా చూస్తేనే మీరు చిరుతను పట్టుకోగలరు. లేట్ ఎందుకు మీరు ట్రై చేయండి.. ఎంత వెతికినా చిరుత దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి..
here is the answer pic.twitter.com/H2Q4W58hRo
— telugufunworld (@telugufunworld) July 27, 2022
కాగా,, వేగానికి చిరుతలు పెట్టింది పేరు. అల్లంత దూరంలో కనిపించిన జంతువును క్షణాల్లో చిరుత తనకు ఎరగా చేసుకుంటుంది. సింహం, పులి లాంటి క్రూర జంతువుల వేటలాగే.. చిరుత వేట కూడా ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..