మిస్టరీ మిల్క్.. ప్రకృతి వింత.. ఈ జంతువు ఇచ్చే పాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ప్రకృతి సృష్టించిన వింతల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని ఆలోచనల్లో పడేస్తాయి. అలాంటి ఒక వింతే బ్లాక్ రైనో పాలు. మనం రోజూ చూసే ఆవు, గేదె పాలు తెల్లగా, చిక్కగా ఉంటాయి. కానీ ఆఫ్రికా అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువు పాలు మాత్రం ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైనవిగా గుర్తింపు పొందాయి. ఈ ఖడ్గమృగం పాలు నిజంగానే నల్లగా ఉంటాయా? అనేది తెలుసుకుందాం..

మిస్టరీ మిల్క్.. ప్రకృతి వింత.. ఈ జంతువు ఇచ్చే పాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Black Rhino Really Produce Black Milk
Image Credit source: AI Image

Updated on: Jun 18, 2026 | 6:06 PM

ప్రకృతి అంటేనే అంతుచిక్కని మిస్టరీ. ఎన్నో వింతలు, విశేషాల నిలయం. ముఖ్యంగా జంతు ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నిత్యం వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ బ్లాక్ మిల్క్. అదేనండీ నల్ల పాలు.. మామూలుగా పాలు అంటే తెల్లగా ఉంటాయి. గేదే, ఆవు సహా దాదాపు జంతువుల పాలు అన్నీ తెల్లగానే ఉంటాయి. కానీ ఒక జంతువు పాలు నల్లగా ఉంటాయని సోషల్ మీడియాలో తరుచూ చర్చ నడుస్తూ ఉంటుంది. ఆ జంతువే ఆఫ్రికాకు చెందిన బ్లాక్ రైనో. దీన్ని పేరులోనే బ్లాక్ ఉన్నట్లుగా ఇది ఇచ్చే పాలు సైతం నల్లగానే ఉంటాయనేది చాలా మంది వాదన. దీని వెనుక ఉన్న అసలు నిజమేంటో పరిశోధకులు వెల్లడించారు.

నిజంగా పాలు నల్లగా ఉంటాయా?

నిజానికి బ్లాక్ రైనో పాలు నల్లటి రంగులో ఉండవు. ఈ జంతువు పేరులో బ్లాక్ అని ఉండటం వల్ల దాని పాలు చూసేందుకు తెల్ల పాలకు భిన్నంగా ఉండటం వల్ల ఈ విధమైన అపోహ ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఈ ఖడ్గమృగం ఇచ్చే పాలు చాలా పల్చగా, ఒక వింతైన రంగులో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం రోజూ చూసే ఆవు, గేదె పాలలా ఇవి చిక్కగా, తెల్లగా ఉండవు.

నీళ్లలా ఉండే పాలు.. ఎందుకంటే?

బ్లాక్ రైనో పాలల్లో ఉండే అత్యంత విచిత్రమైన గుణం ఏంటంటే.. అందులో ఫ్యాట్ శాతం దాదాపు శూన్యం. కేవలం 0.2శాతం కొవ్వు పదార్థాలు మాత్రమే ఈ పాలల్లో ఉంటాయి. కొవ్వు శాతం ఇంత తక్కువగా ఉండటం వల్లే ఆ పాలు చిక్కదనాన్ని కోల్పోయి, దాదాపు నీళ్లలా కనిపిస్తాయి. ప్రకృతిలో లభించే క్షీరదాల పాలల్లోకెల్లా అత్యంత అరుదైన, వింతైన పాలగా దీనిని గుర్తిస్తారు.

సంతానోత్పత్తి – సంరక్షణ

తీవ్రమైన వంశవృద్ది ముప్పును ఎదుర్కొంటున్న ఈ బ్లాక్ రైనోలు చాలా నెమ్మదిగా సంతానోత్పత్తి చేస్తాయి. ఆడ ఖడ్గమృగాలు 4 నుండి 5 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పూర్తి స్థాయి పరిణతి చెందుతాయి. ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం మోసి, ఇవి సాధారణంగా ఒకే ఒక్క పిల్లకి జన్మనిస్తాయి. ఆ తర్వాత తమ పిల్లల సంరక్షణ కోసం ఈ తల్లులు చాలా సమయాన్ని, శ్రద్ధను కేటాయిస్తాయి.

ప్రకృతి వైవిధ్యానికి ప్రతీక

అన్ని జంతువుల పాలు ఒకేలా, చిక్కగా, తెల్లగా ఉండవనడానికి బ్లాక్ రైనో పాలే ఒక పెద్ద ఉదాహరణ. జీవుల అవసరాలకు అనుగుణంగా ప్రకృతి వాటికి భిన్నమైన పోషక విలువలను ప్రసాదించింది. జంతు సామ్రాజ్యంలో దాగి ఉన్న ఇటువంటి విభిన్నమైన, ఆశ్చర్యకరమైన వైవిధ్యానికి ఈ బ్లాక్ రైనో పాల రహస్యం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

Follow Us