Viral Photo: ఈ ఫోటోలో గుడ్లగూబ దాగుంది.. అదెక్కడుందో కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే!

ఫన్‌తో పాటు మీ మెదడుకు కూడా పదును పెట్టాలని అనుకుంటున్నారా.? అయితే మీ రిలాక్సేషన్‌కు ఫన్‌తో పాటు మెదడుకు..

Viral Photo: ఈ ఫోటోలో గుడ్లగూబ దాగుంది.. అదెక్కడుందో కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే!
Owl

Updated on: Apr 01, 2022 | 2:01 PM

ఫన్‌తో పాటు మీ మెదడుకు కూడా పదును పెట్టాలని అనుకుంటున్నారా.? అయితే మీ రిలాక్సేషన్‌కు ఫన్‌తో పాటు మెదడుకు మేత వేసే గేమ్స్, పజిల్స్ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని దొరుకుతాయి. ఎంటర్టైన్మెంట్‌కు ఒకే ఒక్క ఆప్షన్ సోషల్ మీడియా. ఇక ఇంటర్నెట్‌లో మీ మెదడుతో ఆడుకోవడమే కాదు.. కళ్ళను కూడా మోసం చేసే ఫోటో పజిల్స్ కోకొల్లలు. ఇవి ఎప్పుడూ మన కళ్ళను మభ్యపెడుతూ.. మెదడుకు పదును పెడుతుంటాయి. వీటిని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తారు. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడతారు. అందులో మీరూ ఉంటారులెండి! మరి అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ గుడ్లగూబ దాగుంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అది ఓ చెట్టు బెరడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. అక్కడే ఓ గుడ్లగూబ ఎంచక్కా సేద తీరుతోంది. మీరు ఫోటోను నిశితంగా పరిశీలిస్తే.. ఆ గుడ్లగూబను కనిపెట్టగలరు. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

Also Read: 

Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

వాళ్లు వదులుకున్నారు.. వీళ్లు ఒడిసి పట్టుకున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీరే!

180 బంతుల్లో 220 పరుగులు.. 6గురి బౌలర్ల భరతం పట్టారు.. కట్ చేస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు!

Viral Video: అయ్యో.! చూస్కోబడ్లే.! ఫోన్ చూసుకుంటూ నడిచాడు.. పట్టాలపై పడ్డాడు.. కట్ చేస్తే!