Viral Video: హోం వర్క్ అడిగిన టీచర్ కు.. స్టూడెంట్ నుంచి అదిరిపోయే కాంప్లిమెంట్.. చీరలో చాలా బాగున్నారంటూ..

|

Aug 20, 2022 | 6:55 AM

రకరకాల వీడియోలకు సోషల్ మీడియా (Social Media) ఓ మంచి ప్లాట్ ఫామ్. ఇక్కడ నిత్యం ఎన్నో రకాల వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. ఎప్పుడు ఏ విషయం ట్రెండ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని రకాల వీడియోలు ఫన్నీ గా అనిపిస్తే మరి కొన్ని..

Viral Video: హోం వర్క్ అడిగిన టీచర్ కు.. స్టూడెంట్ నుంచి అదిరిపోయే కాంప్లిమెంట్.. చీరలో చాలా బాగున్నారంటూ..
Student Teache Home Work
Follow us on

రకరకాల వీడియోలకు సోషల్ మీడియా (Social Media) ఓ మంచి ప్లాట్ ఫామ్. ఇక్కడ నిత్యం ఎన్నో రకాల వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. ఎప్పుడు ఏ విషయం ట్రెండ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని రకాల వీడియోలు ఫన్నీ గా అనిపిస్తే మరి కొన్ని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. ఇది చూసిన తర్వాత మీకు మీ బాల్యం తప్పకుండా గుర్తుకు వస్తుంది. చిన్నతనంలో టీచర్లు హోం వర్క్ కోసం కాపీ అడిగే రోజులను మీరు అంత సులభంగా మర్చిపోలేరు. వైరల్ అవుతున్న క్లిప్ లో టీచర్ నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఓ చిన్నారి చేసిన పని చూస్తే పడీపడీ నవ్వాల్సిందే. వైరల్ అవుతున్న ఈ వీడియో క్లాస్‌రూమ్‌లో రికార్డయింది. స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఓ స్టూడెంట్.. టీచర్‌తో మాట్లాడుతున్నాడు. టీచర్ అందరి హోమ్ వర్క్ చెక్ చేస్తున్న సమయంలో ఈ బుడ్డోడి వంతు వచ్చింది. హోం వర్క్ చూపించాలని కోరితే.. వింత వింత సమాధానాలు చెప్పాడు. మీరు చీర కట్టుకుని వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారని టీచర్ కు చెప్పడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఆ చీర చాలా బాగుందని ప్రశంసించాడు. అంతే కాకుండా మీరే నా ఫేవరెట్ టీచర్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చేశాడు.

20 సెకన్ల ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటివరకు 1.22 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. హోమ్‌వర్క్‌ను తప్పించుకోవడానికి పిల్లవాడు గొప్ప పనే చేశాడని, అమాయక పిల్లలు చాలా తెలివైన వాళ్లని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన యూజర్లు తమకు తెలిసినవారికి, బంధువులకు, ఫ్రెండ్స్ కు షేర్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..