Viral: కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా.. వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం!

|

Sep 11, 2022 | 1:54 PM

33 ఏళ్ల వయసున్న ఓ మహిళ.. తీవ్రమైన కడుపునొప్పితో దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు..

Viral: కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా.. వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం!
Representative Image
Follow us on

33 ఏళ్ల వయసున్న ఓ మహిళ.. తీవ్రమైన కడుపునొప్పితో దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు టెస్టులు చేశారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి షాక్ తిన్నారు. వెలుగులోకి వచ్చిన ఆ స్టన్నింగ్ నిజాన్ని ఆమెకు చెప్పగా.. బాధితురాలి ఒక్కసారిగా లబోదిబోమంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల సునీతాదేవి.. తీవ్రమైన కడుపునొప్పితో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు టెస్టులు చేసి.. గర్భాశయం తొలగించాలని చెప్పారు. దీంతో సునీతాదేవి కుటుంబసభ్యులు ఆపరేషన్ రూ. 30 వేలకు జరిగేలా మాట్లాడుకున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. అయితే ఆ మరుసటి రోజు నుంచే సునీతా దేవి ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారింది.

దీంతో చేసేదేమిలేక ఆమె కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 5వ తేదీన పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు సునీతాను పరీక్షించి.. షాకింగ్ నిజాన్ని చెప్పారు. ఆమె శరీరంలో రెండు కిడ్నీలు లేవని తెలిపారు. దీంతో ఒక్కసారిగా సునీత కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కిడ్నీలు తీసేయడమేంటని లబోదిబోమన్నారు. కాగా, సదరు క్లినిక్ నిర్వాహకుడిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతడిపై మానవ అవయవాల మార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.