Viral Video: ఓరీ దేవుడో.. కొబ్బరి నీళ్లను కూడా వదలని కంత్రీగాళ్లు.. ఎలా కల్తీ చేస్తున్నారో చూస్తే.. లబోదిబో మంటారు!

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కొబ్బరి నీళ్ల (Coconut Water) అమ్మకాల్లో జరుగుతున్న కల్తీని బయటపెట్టింది. సహజమైన, ఆరోగ్యకరమైన పానీయంగా మనం నమ్మి తాగే కొబ్బరి నీళ్లలో రసాయనాలు ఎలా కలుపుతున్నారనే చూపించే వార్త వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొబ్బరి నీళ్లు తీపిగా, తాజాగా కనిపించడం కోసం కొందరు వ్యాపారులు ప్రమాదకరమైన రసాయనాలను (Chemicals) ఉపయోగిస్తున్నట్లు ఒక వైరల్ వీడియో వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: ఓరీ దేవుడో.. కొబ్బరి నీళ్లను కూడా వదలని కంత్రీగాళ్లు.. ఎలా కల్తీ చేస్తున్నారో చూస్తే.. లబోదిబో మంటారు!
Coconut Water

Updated on: Apr 04, 2026 | 12:06 PM

వేసవి కాలంలో దాహాన్ని తీర్చుకోవడానికి, శక్తిని పొందడానికి మనం అందరం కొబ్బరి నీళ్లను ఎంచుకుంటాం. కానీ, లాభాల కోసం కొందరు అక్రమ వ్యాపారులు ఈ ప్రకృతి ప్రసాదించిన పానీయాన్ని కూడా వదలడం లేదు. ఇటీవల వైరల్ అవుతున్న ఒక వీడియో కొబ్బరి నీళ్ల కల్తీని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. వైరల్ వీడియో, నివేదికల ప్రకారం, కొబ్బరి బొండాలను ఆకర్షణీయంగా మార్చడానికి రకరకాల కన్నింగ్‌ ట్రిక్స్‌ వాడుతున్నట్లు సమాచారం. అవేంటో తెలిస్తే మనం లబోదిబో మనాల్సిందే.

బొండం పైభాగం నల్లబడకుండా, తెల్లగా మెరుస్తూ ఉండటానికి వాటిని బ్లీచింగ్ ఏజెంట్లు లేదా ఇతర రసాయన ద్రావణాల్లో ముంచుతున్నారు. తక్కువ నీరున్న లేదా రుచి లేని కొబ్బరి కాయల్లోకి సిరంజీల ద్వారా చక్కెర కలిపిన నీటిని లేదా రసాయనాలను ఎక్కిస్తున్నారు. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి కల్తీ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇవి శరీరంలోని అవయవాలపై, ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఎప్పుడూ మీ కళ్ల ముందే కొబ్బరి బొండాన్ని కొట్టించి, స్ట్రా వేయించుకోకుండా నేరుగా గ్లాసులోకి పోయించుకుని తాగడానికి ప్రయత్నించండి. బొండం పైన మరీ తెల్లగా, పాలిపోయినట్లు ఉంటే అనుమానించాలి. సహజమైన బొండాలు కొంచెం గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో సహజంగా ఉంటాయి. నీళ్లు తాగినప్పుడు కృత్రిమమైన తీపి లేదా వింత వాసన వస్తే వెంటనే ఆపివేయండి. ఆరోగ్యం కోసం తాగే పానీయం అనారోగ్యానికి దారి తీయకూడదు. కొబ్బరి నీళ్లు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మీరు మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us