VIRAL VIDEO : ఆ గ్రామంలో గాడిదపై ఊరేగిన సర్పంచ్.. డ్యాన్స్‌లు, ఈలలతో గోళ చేసిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..

VIRAL VIDEO : మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ నమ్మకాలను అనుసరిస్తారు. వర్షానికి సంబంధించి కొన్ని

VIRAL VIDEO : ఆ గ్రామంలో గాడిదపై ఊరేగిన సర్పంచ్.. డ్యాన్స్‌లు, ఈలలతో గోళ చేసిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..
Sarpanch

Updated on: Jul 23, 2021 | 6:16 PM

VIRAL VIDEO : మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ నమ్మకాలను అనుసరిస్తారు. వర్షానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉంటాయి. వరుణుడు కరుణించాలని మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లాకు చెందిన సర్పంచ్ గాడిదపై ఊరేగాడు. తద్వారా మంచి వర్షాలు కురుస్తాయని నమ్మకం. గాడిదపై ఊరేగుతున్న సర్పంచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో తగినన్ని వర్షాలు కురవకపోవడంతో రైతులు కలత చెందుతున్నారు. దీంతో వర్షాలు కురవాలని వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. విధిశా జిల్లాలోని రంగై గ్రామంలో వింత ఆచారం ఒకటి ప్రచారంలో ఉంది.

అందులో భాగంగా గ్రామ సర్పంచ్ సుశీల్ వర్మను గాడిదపై ఊరేగిస్తూ గ్రామం మొత్తం తిరిగారు. ఈ యాత్రలో గ్రామ ప్రజలు, మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు. ప్రజలు కూడా డ్యాన్స్‌లతో, విజిల్స్‌తో డప్పు చప్పుళ్ల మధ్య ఎంజాయ్ చేశారు. సర్పంచ్ గాడిదపై నడుస్తుండగా ప్రజలందరు గుంపుగా అతడితో గ్రామం మొత్తం కలియతిరిగారు. అయితే సర్పంచ్ పర్యటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ప్రయాణం పటేల్ బాబా దేవస్థాన్ నుంచి ప్రారంభమై గణేష్ జి ఆలయానికి చేరుకుంది. అక్కడ గ్రామ ప్రజలు మంచి వర్షాలు పడాలని ప్రార్థించారు. గాడిదపై ఊరేగుతున్న సర్పంచ్ సుశీల్ వర్మ ఇలా చెప్పాడు.

“గ్రామీణ ప్రాంతాలలో వింత ఆచారం వాడుకలో ఉంది. గ్రామ అధిపతి గాడిదపై స్వారీ చేస్తే వర్షం పడుతుంది నమ్మకం. ఈ కారణంగా గాడిదపై స్వారీ చేశాను. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా గ్రామస్థులక సమస్యను పరిష్కరించడం నా బాధ్యత. అందుకే గాడిదపై ఊరేగి ఆ వరుణ దేవున్ని ప్రార్థించాను ” అన్నారు. గాడిదపై ఊరేగిన సర్పంచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు దీన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడమే కాదు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఈ విషయాన్ని ఎగతాళి చేయగా కొంతమంది దేశవ్యాప్తంగా ఈ పద్దతి పాటించాలని ప్రోత్సహిస్తున్నారు.

Speaker Tammineni: అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్

Olympics 2021 Opening Ceremony Live: విశ్వ క్రీడా మహోత్సవం ప్రారంభం..

Megastar Chiranjeevi: మెగాఫ్యాన్స్‌‌‌కు గుడ్ న్యూస్.. చిరు153వ సినిమా పనులు ప్రారంభం అయ్యాయి..