Viral CCTV Footage: అమ్మో ‘బొమ్మ’ పగబట్టింది.. హడలెత్తిస్తున్న సీసీటీవీ ఫుటేజీ.. మీరూ ఓ లుక్కేయండి..!

Viral CCTV Footage: అనబెల్‌‌, రాబర్ట్‌‌ లాంటి బొమ్మలు వరల్డ్‌ వైడ్‌గా జనాల్ని భయపెట్టాయి. తాజాగా మరోబొమ్మ పగబట్టింది. మనుషుల్ని చంపాలని..

Viral CCTV Footage: అమ్మో ‘బొమ్మ’ పగబట్టింది.. హడలెత్తిస్తున్న సీసీటీవీ ఫుటేజీ.. మీరూ ఓ లుక్కేయండి..!
Revange

Updated on: May 06, 2022 | 8:10 AM

Viral CCTV Footage: అనబెల్‌‌, రాబర్ట్‌‌ లాంటి బొమ్మలు వరల్డ్‌ వైడ్‌గా జనాల్ని భయపెట్టాయి. తాజాగా మరోబొమ్మ పగబట్టింది. మనుషుల్ని చంపాలని చూస్తోంది..అవును మీరు వింటున్నది నిజమే..ఈ బొమ్మ తనంతట తానుగా వస్తువుల్ని విసిరేస్తోంది..ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అమ్మో బొమ్మ పగబట్టిందంటూ షాక్‌ అవుతున్నారు.

సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ఈ సీసీ ఫుటేజ్‌ వీడియోలో…ఓ వ్యక్తి మామూలుగా తన పని తాను చేసుకుంటున్నాడు..పక్కనే ఉన్న షేల్ప్‌లో అన్నీ అనే ఓ బొమ్మపెట్టబడి ఉంది. అది ఉన్నట్టుండి దాని పక్కనే ఉన్న ఎమిలీ రోజ్ అనే మరో బొమ్మను గట్టిగా కిందకు తోసేసింది. బొమ్మ టేబుల్‌పై పడిపోవటం గమనించిన సదరు వ్యక్తి షాక్‌ అయ్యాడు..అయోమయంగా అటు ఇటూ చూశాడు. ఆ బొమ్మ ఎందుకు పడిందో అర్థం కానట్లు ఫేస్ పెట్టాడు. ఆ తర్వాత ఈ రెండు బొమ్మలు దెయ్యాలని, ఎమిలీ రోజ్ బొమ్మపై ఈర్ష్యతోనే అన్నీ బొమ్మ దాన్ని తోసేసిందని ప్రచారం మొదలుపెట్టాడు. వీడియో చూసిన నెటిజన్లు సైతం తొలుత బొమ్మ యాక్షన్‌ చూసి భయపడిపోయారు. కానీ, కాస్త తెరుకున్నాక, వీడియోకు తగిన కామెంట్లతో ఝలక్‌ ఇస్తున్నారు.