Viral Video: అచ్చం మనుషుల్లానే..! పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఎలుకలు.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

Rats fighting Viral Video: మనుషులు పోట్లాడుకునే సన్నివేశాలు చాలానే చూసుంటాం.. క్షణికావేశంలో, ఆధిపత్య పోరులో ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి. అయితే.. ఇలాంటివి

Viral Video: అచ్చం మనుషుల్లానే..! పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఎలుకలు.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే
Viral Video

Updated on: Apr 19, 2022 | 9:58 AM

Rats fighting Viral Video: మనుషులు పోట్లాడుకునే సన్నివేశాలు చాలానే చూసుంటాం.. క్షణికావేశంలో, ఆధిపత్య పోరులో ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి. అయితే.. ఇలాంటివి మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక సింహం మరొక సింహంతో పోరాడుతూ ఉంటుంది.. కొన్నిసార్లు ఒక ఏనుగు మరొక ఏనుగుతో ఢీకొంటుంది. ఇలాంటి జంతువుల మధ్య భీకర పోరు కనిపిస్తుంది. అయితే ఎలుకల మధ్య భీకర పోరును మీరెప్పుడైనా చూశారా..? అది కూడా మనుషుల్లా నిలబడి మరి పొట్టుపొట్టుగా కొట్టుకుంటున్నాయి. బహుశా ఇలాంటి సన్నివేశాలను మీరు చూసి ఉండకపోవచ్చు. ఇలాంటి అరుదైన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రెండు ఎలుకలు మనుషులలా పోరాడుతున్నాయి. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ఫన్నీ ఘటన సీసీటీవీలో రికార్డయింది.

ఓ వ్యక్తి సోఫాలో హాయిగా కూర్చుని మొబైల్‌లో ఏదో చూస్తుంటాడు. ఈ క్రమంలో అటు, టు రెండు ఎలుకలు వస్తాయి. రెండు ఎదురెదురుగా తారసపడటంతో.. ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం ప్రారంభిస్తాయి. రెండు కాళ్లపై నిలబడి మనుషుల్లా కుస్తీలు పడుతూ కనిపిస్తాయి. అయితే వాటి మధ్య ఈ పోరు ఎక్కువ కాలం సాగదు.. ఆ తర్వాత రెండూ కూడా వెళ్లిపోయాయి. కానీ కొన్ని సెకన్ల తర్వాత ఎలుకలలో ఒకటి మళ్లీ వచ్చి సోఫాలో కూర్చున్న వ్యక్తి తల దగ్గర తిరగడం ప్రారంభించింది. దీని కారణంగా వ్యక్తి తన తల దగ్గర ఏదో ఉందని గ్రహించాడు. కానీ అతను పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ అతను మొబైల్‌ చూస్తూ ఉండిపోతాయి.

వీడియో చూడండి..

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Discovery.engenharia యూజర్ షేర్ చేయగా.. ఇప్పటివరకు 1.7 మిలియన్లు అంటే 17 లక్షల మంది వీక్షించారు. లక్షా 22 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: భార్యాభర్తల పంచాయితీ..! మంచం మీద సీన్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్

Viral Video: పరోటాను చూసి.. పరుగులు తీసిన చైనా ఆర్మీ.. ఫన్నీ వీడియో మీకోసం..!

Loading...
Unable to load recommendations.
Follow Us