ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత అనేది అత్యంత ఆవశ్యకం. ఇందులో భాగంగా రోజూ స్నానం చేయడం చాలా అవసరం. స్నానం మన శరీరంలోని మలినాలనే కాకుండా, మానసిక ఆందోళననూ తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. మనుషులందరికీ స్నానం చేయడం...
Ad
Rat Bathing Video
Follow us on
ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత అనేది అత్యంత ఆవశ్యకం. ఇందులో భాగంగా రోజూ స్నానం చేయడం చాలా అవసరం. స్నానం మన శరీరంలోని మలినాలనే కాకుండా, మానసిక ఆందోళననూ తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. మనుషులందరికీ స్నానం చేయడం అలవాటే. అయితే ఎలుక స్నానం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా, అది కూడా మనుషుల్లా రుద్దుకొని స్నానం చేయడం. మీరు చూడకుంటే ఇప్పుడే చూసేయండి. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఔరా అనుకుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్ కొన్ని సెకన్లు మాత్రమే ఉంది. ఈ ఎలుక పరిశుభ్రతకు మీరందరూ సలాం కొట్టాల్సిందే. ఒక ఎలుక బాత్రూంలో మునిగిపోయి, సబ్బు నురుగుతో రుద్దుకొని స్నానం చేయడాన్ని మీరు చూడవచ్చు. ఎలుక ముఖాన్ని చేతులతో రుద్దుకుంటూ స్నానం చేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫన్నీ వీడియో @Tom_Morrow_ హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 39 సెకన్ల నిడివి కలిగిన ఈ క్లిప్‌ను నెటిజన్లు విపరీతంగా చూసేస్తున్నారు. అంతే కాకుండా ఫన్నీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి