AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. అతడు ఓపెన్ చేసి చూడగా

మీ ఏసీ సరిగ్గా పనిచేయడం లేదా? అయితే అందులో ఎలుకలు లేదా కందిరీగలు చేరాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎల్జీ ఏసీ ఇండోర్ యూనిట్‌లో ఎలుకలు, అవుట్ డోర్ యూనిట్‌లో కందిరీగలు తిష్టవేసిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral Video: ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. అతడు ఓపెన్ చేసి చూడగా
Viral Video
Ravi Kiran
|

Updated on: May 09, 2026 | 2:17 PM

Share

ఓ ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే.. కూలింగ్ సరిగ్గా రావట్లేదు. ఆ కుటుంబం అన్ని ప్రయత్నాలు చేసినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అయితే టెక్నీషియన్‌ను పిలిచి చెక్ చేయించగా.. షాకింగ్ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే..! ఏసీ సర్వీసింగ్ అనేది కేవలం ఫిల్టర్లు క్లీన్ చేయడం మాత్రమే కాదు, ఒక్కోసారి అది పెద్ద సాహసంగా మారుతుంది. ఆర్మాన్ అనే ఏసీ టెక్నీషియన్ షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక కస్టమర్ ఇంట్లోని ఎల్జీ ఏసీని చూసి అతను అవాక్కయ్యాడు. ఒకవైపు ఇండోర్ యూనిట్‌లో ఎలుకలు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే, మరోవైపు అవుట్ డోర్ యూనిట్‌లో కందిరీగలు గూడు కట్టుకున్నాయి.

ఇది చదవండి: పొలానికి వెళ్లిన రైతుకు దూరంగా ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా.. ఆశ్చర్యంగా.!

ఎలుకలు ఇండోర్ యూనిట్‌లోకి ప్లాస్టిక్ ముక్కలు, ఇతర వ్యర్థాలను మోసుకొచ్చి నింపేశాయి. అంతటితో ఆగకుండా, ఏసీలోని ముఖ్యమైన వైర్లను, ముఖ్యంగా స్వింగ్ మోటార్ వైర్‌ను మొదలుకే కత్తిరించేశాయి. దీనివల్ల ఏసీ పనిచేయడం ఆగిపోయింది. సెన్సార్ వైర్లను కూడా ముక్కలు చేయడంతో టెక్నీషియన్ వాటిని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఎలుకలు కొరికిన ప్లాస్టిక్ ట్రేని తిరిగి అతకడానికి ఎమ్‌సీల్(M-seal) వాడాల్సి వచ్చింది. టెక్నీషియన్ అవుట్ డోర్ యూనిట్ చెక్ చేయడానికి వెళ్తే, అక్కడ భారీ స్థాయిలో కందిరీగలు గూడు కట్టుకుని ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వాటిని తొలగించడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని. కస్టమర్ తెచ్చిన ‘రెడ్ హిట్’ స్ప్రే సహాయంతో టెక్నీషియన్ ఎంతో జాగ్రత్తగా వాటిని తరిమికొట్టి, ఆ గూడును పక్కకు తొలగించాడు. తన భద్రత కోసం ఎత్తులో ఉండి ఈ పనిని పూర్తి చేశాడు. చివరకు వైర్లన్నీ సరిచేసి, సర్వీసింగ్ పూర్తి చేసిన తర్వాత ఏసీ మళ్ళీ చక్కగా కూలింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఏసీలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోకపోతే, ఇలాంటి జీవులు చేరి లోపల వైర్లను పాడుచేయడమే కాకుండా, మనకు కూడా ప్రమాదకరంగా మారుతాయని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

ఇది చదవండి: మీ ఇంటిలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే..? ఇది ఒక్కటి వేస్తే వద్దన్నా పూస్తాయ్..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us