Video: ఏంది భయ్యా నువ్వు.. ‘పెద్ది’ క్రికెట్‌కే పిచ్చెక్కించావ్‌గా.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Peddi Cricket Video: పెద్ది సినిమా విడుదలయ్యాక రామ్ చరణ్ అభిమానులు సెలబ్రేషన్స్ మాములుగా లేవు. సినిమాలో రామ్ చరణ్ డ్యాన్స్, క్రికెట్ షాట్స్‌ను రీక్రియోట్ చేస్తూ సోసల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిన్న డ్యాన్స్ వీడియో వైరల్ కాగా, నేడు రామ్ చరణ్ క్రికెట్ షాట్స్ తెగ వైరలవుతున్నాయి.

Video: ఏంది భయ్యా నువ్వు.. పెద్ది క్రికెట్‌కే పిచ్చెక్కించావ్‌గా.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Peddi Cricket Video

Updated on: Jun 06, 2026 | 8:03 AM

Peddi Cricket Video: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్, వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ‘పెద్ది’ సినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్ చేసిన క్రికెట్ షాట్స్ రిహార్సల్స్ వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ‘మువీస్ 4 యు అఫీషియల్’ అనే పేజీ షేర్ చేసిన ఈ లీక్డ్ రిహార్సల్ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

3 డిఫరెంట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్.. ‘పెద్ది’ కోసం చరణ్ కఠిన శ్రమ!

‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ కేవలం ఒక సాధారణ పాత్రలో కాకుండా, విభిన్న క్రీడల్లో నైపుణ్యం ఉన్న పల్లెటూరి యువకుడిగా కనిపించారు. అందుకోసం ఆయన శారీరకంగా ఎంతో శ్రమించాడు. ముఖ్యంగా సినిమాలో వచ్చే క్రికెట్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌గా నిలిచాయి. విజయనగరం ప్రాంతానికి చెందిన ఒక సాధారణ యువకుడు తన గ్రామం కోసం, అక్కడి ప్రజల గుర్తింపు కోసం క్రీడల ద్వారా ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. ఈ పాత్రలో జీవించడానికి చరణ్ క్రికెట్‌తో పాటు రెజ్లింగ్ (కుస్తీ) లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ అభిమాని రామ్ చరణ్ క్రికెట్ పిచ్‌పై విభిన్నమైన షాట్లను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఊరమాస్ స్టైల్లో ఆయన బ్యాట్ తిప్పుతుంటే, థియేటర్లలో కనిపించిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఈ రిహార్సల్స్ లోనే దాగున్నాయని అభిమానులు మురిసిపోతున్నారు.

సోషల్ మీడియాను ఊపేస్తున్న #PEDDI క్రికెట్ ప్రాక్టీస్ వీడియో..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే వేలాది వ్యూస్, లైకులతో దూసుకుపోతోంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ, రామ్ చరణ్ డెడికేషన్‌కు హ్యాండ్సాప్ చెప్తున్నారు. రంగస్థలం తర్వాత చరణ్ మళ్లీ ఆ స్థాయి నటనను, శ్రమను ఈ సినిమాలో పెట్టారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

“సినిమాలో ఆ క్రికెట్ షాట్స్ థియేటర్ లో చూసినప్పుడు పూనకాలు వచ్చాయి.. ఇప్పుడు ఈ రిహార్సల్స్ వీడియో చూస్తుంటే చరణ్ అన్న పడ్డ కష్టం ఏంటో అర్థమవుతోంది!” అని ఒక మెగా అభిమాని కామెంట్ చేయగా.. “బుచ్చిబాబు సానా చరణ్ బాడీ లాంగ్వేజ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ శ్రమ ఇది” అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.

‘పెద్ది’ విశేషాలు..

మెగా పవర్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఇప్పటికే రివ్యూలు వచ్చాయి. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించింది.

ఇది కూడా చదవండి: Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

ఏదైనా ఒక పాత్రను ఒప్పుకుంటే అందుకోసం 100% ప్రాణం పెట్టడం రామ్ చరణ్ శైలి. ఈ ‘పెద్ది క్రికెట్ షాట్స్ రిహార్సల్’ వీడియో చూశాక అది మరోసారి నిరూపితమైంది. కేవలం స్క్రీన్ మీద కనిపించే మాస్ ఎలివేషన్స్ వెనుక ఎంతటి కఠోర సాధన ఉంటుందో ఈ వీడియో సినిమా లవర్స్ అందరికీ తెలియజేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us