Video: యాక్‌.. ఈ వీడియో చూస్తే ఇంకోసారి మీరు ట్రైన్‌లో ఫుడ్‌ తినరు! వాడి పడేసినవి ఏరుకొచ్చి..

ఈరోడ్-జోగ్బానీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నుండి వచ్చిన షాకింగ్ వీడియో రైళ్లలో ఆహార పరిశుభ్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. వాడిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను కడిగి మళ్లీ వాడటానికి సిద్ధం చేయడం ఇందులో కన్పిస్తుంది. భారతీయ రైల్వేలు ఆహార భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి సంఘటనలు ప్రయాణీకుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.

Video: యాక్‌.. ఈ వీడియో చూస్తే ఇంకోసారి మీరు ట్రైన్‌లో ఫుడ్‌ తినరు! వాడి పడేసినవి ఏరుకొచ్చి..
Disposable Food Containers

Updated on: Oct 19, 2025 | 5:15 PM

రైళ్లలో లాంగ్‌ జర్నీ చేసేవాళ్లు ఆకలేస్తే.. రైల్వే స్టేషన్స్‌లో దొరికే లేదా ట్రైన్స్‌లో అమ్మకానికి వచ్చే భోజన ప్యాకెట్లను కొని తింటుంటారు. వెజ్‌ బిర్యానీ, ఎగ్‌ బిర్యానీ వంటివి సిల్వర్‌ డిస్పోజబుల్‌ కంటైనర్లలో అమ్ముతుంటారు. అయితే వాటిలో తినేసి అందరూ పడేస్తారు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం ఇకపై అలాంటి తినాలంటే వందసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే తాజాగా బయటికి వచ్చిన ఓ వీడియోలో వాడి పడేసిన డిస్పోజబుల్‌ కంటైనర్లను కడిగి, మళ్లీ వాడేందుకు సిద్ధం చేస్తున్నట్లు అర్థం అవుతుంది.

ఈరోడ్-జోగ్బానీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (16601) రైలు నుండి వచ్చిన ఒక షాకింగ్ వీడియోలో ఒక వ్యక్తి ఉపయోగించిన డిస్పోజబుల్ కంటైనర్లను మళ్ళీ ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో కడుగుతున్నట్లు చూడొచ్చు. భారతీయ రైళ్లలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల గురించి ఆందోళనలను హైలైట్ చేసే ఈ వీడియో సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

అయితే ఆహార భద్రతను మెరుగుపరచడానికి భారతీయ రైల్వేలు చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆహార తయారీని పర్యవేక్షించడానికి వంటశాలలలో కెమెరాలను ఏర్పాటు చేయడం, క్యాటరింగ్ యూనిట్లకు తప్పనిసరి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సర్టిఫికేషన్ వంటి రూల్స్‌ ఉన్నాయి. పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడానికి అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్‌లు కూడా చేస్తారు. ఇన్ని ఉన్న కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి