Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

|

Nov 20, 2021 | 10:13 PM

Rabbit runs on train track: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?
Rabbit Runs On Train Track
Follow us on

Rabbit runs on train track: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే కొన్ని వీడియోలను చూస్తే చాలా సరదాగా ఉంటుంది. తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే.. రైలు పట్టాలపై కుందేలు చేసిన సహాసాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రాణాలను కాపాడుకోవడానికి రైలుతో పోటి పడి మరి పరిగెత్తింది. విపత్కర పరిస్థితిని ధైర్యంతో ఎదుర్కొంది. కష్టాల్లో మడమ తిప్పకుండా.. పరిగెత్తి కుందేలు ప్రాణాలను కాపాడుకోవడంపై పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. రైల్వే ట్రాక్‌పై ఒక అందమైన కుందేలు పరుగెత్తడాన్ని మీరు చూడవచ్చు. దాని వెనుకే రైలు వేగంతో వస్తుంటుంది. అయితే.. ప్రాణాలను కాపాడుకునేందుకు కుందేలు పరిగెడుతుంటుంది. అయితే.. ప్రాణాలతో పోరాడుతున్న కుందేలును చూసి రైలు డ్రైవర్ కూడా కాస్త వేగం తగ్గించి.. హారన్‌తో దానిని హెచ్చరిస్తుంటాడు. ఈ క్రమంలో వేగంగా పరుగులు తిసిన కుందేలు చివరకు ప్రాణాలను కాపాడుకుంది. ఈ షాకింగ్ వీడియోను వైరల్ హాగ్ అనే ఫేస్‌బుక్‌ ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోను కోటి మందికి పైగా నెటిజన్లు వీక్షించారు.

వీడియో..

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతుండటంతో నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రమాదంలో ఉన్న కుందేలును చూసి.. మొదట ఉద్వేగానికి లోనైనట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చివరకు కుందేలు ప్రాణాలు దక్కడంతో ఊపిరిపీల్చుకున్నామని.. కుందేలు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనంటూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. రైలు డ్రైవర్‌ను కూడా ప్రశంసిస్తున్నారు. కుందేలును అప్రమత్తం చేయకపోతే దాని ప్రాణాలు పోయేవని.. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించారంటూ కొనియాడుతున్నారు.

Also Read:

Liquor vs Food: మద్యం సేవిస్తూ ఇవి తింటున్నారా? ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..!

Love: ప్రియుడు మాట్లాడటం లేదని 100 నెంబర్‌కు ఫోన్‌ చేసిన ప్రియురాలు.. చివరకు పోలీసులు ఏం చేశారంటే..?