Viral Video: గోడపై కూర్చుని ఫ్రాంక్‌ చేస్తుండగా విషాదం.. మూడో ఫ్లోర్‌ నుంచి పడి మహిళ మృతి! వీడియో

|

Jul 18, 2024 | 11:25 AM

సరదా ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. గోడపై కూర్చుని ఫ్రాంక్‌ చేసేందుకు యత్నించగా.. అది కాస్తా బెడిసికొట్టింది. దీంతో మూడో అంతస్తు నుంచి మహిళ కింద పడి మరణించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవగా.. ఆ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Viral Video: గోడపై కూర్చుని ఫ్రాంక్‌ చేస్తుండగా విషాదం.. మూడో ఫ్లోర్‌ నుంచి పడి మహిళ మృతి! వీడియో
Prank Goes Wrong In Mumbai
Follow us on

ముంబై, జులై 18: సరదా ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. గోడపై కూర్చుని ఫ్రాంక్‌ చేసేందుకు యత్నించగా.. అది కాస్తా బెడిసికొట్టింది. దీంతో మూడో అంతస్తు నుంచి మహిళ కింద పడి మరణించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవగా.. ఆ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ముంబైలోని డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌లోని క్లీనింగ్‌ సెక్షన్‌లో నాగినా దేవి అలియాస్‌ గుడియా దేవి పని చేస్తుంది. మంగళవారం (జులై 16) మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో విరామ సమయంలో భవనం మూడో అంతస్తులో మెట్ల వద్ద ఉన్న గోడపై నాగినా కూర్చొంది. సహోద్యోగులతో కలిసి జోకులు వేస్తూ నవ్వుతూ ఉంది. ఇంతలో బంటీ అనే మరో వ్యక్తి వ్యక్తి ఆమెపై వాలడంతో ఆమె వెనక్కిపడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో పట్టుతప్పి ఆమె అక్కడి నుంచి అమాంతం కింద పడిపోయి మృతి చెందింది. ఆమెతోపాటు అతను కూడా వెనక్కి పడగా.. పిట్టగోడ పట్టుకుని నిలదొక్కుకోవడంతో బంటికి ప్రమాదం తప్పడంతో బతికిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని..నాగినా దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ప్రమాదం ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మృతురాలు గుడియా దేవిగా.. నాగినా దేవి భవనంలో కాపలాదారుగా పనిచేస్తుంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగినాదేవి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.