
మొక్కలు సూర్యరశ్మి, నీరు, గాలిని పీల్చుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయని మనందరికీ తెలుసు. కానీ పురుగులు, కీటకాలు, చివరకు చిన్న చిన్న ఎలుకలు, కప్పలను కూడా వేటాడి తినే మొక్కలు ఉన్నాయని మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రకృతిలో ఇవి నిజం.. వీటిని శాస్త్రీయంగా కీటకాహార మొక్కలు అని పిలుస్తారు. ఈ మొక్కలు పెరిగే చిత్తడి నేలల్లో నైట్రోజన్, పాస్పరస్ వంటి అత్యవసర పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. బ్రతకడానికి అవసరమైన ప్రోటీన్లు, నైట్రోజన్ నేల నుంచి లభించకపోవడంతో.. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఇవి కీటకాలు, చిన్న జంతువులను వేటాడి, వాటి మాంసం నుంచి రక్తం, పోషకాలను పీల్చుకుంటాయి.
దీని ఆకులు ఒక బోనులా రెండు రెక్కలుగా విడిపోయి ఉంటాయి. ఆకుల మధ్యలో సూక్ష్మమైన రోమాలు ఉంటాయి. ఏదైనా ఈగ లేదా కీటకం ఆ రోమాలను రెండుసార్లు తాకగానే క్షణంలో ఆకులు మూసుకుంటాయి. ఆ తర్వాత ఎంజైములను విడుదల చేసి కీటకాన్ని పూర్తిగా ద్రవంగా మార్చి జీర్ణం చేసుకుంటుంది.
పిచ్చర్ ప్లాంట్ ఆకులు ఒక కూజా ఆకారంలో ఉంటాయి. లోపల స్వీట్ ద్రవం ఉంటుంది. దాని వాసనకు ఆకర్షితులై వచ్చే కీటకాలు, చిన్న కప్పలు ఆ నునుపైన అంచుపై కాలు జారి నేరుగా లోపల ఉన్న జీర్ణ రసాల్లో పడిపోతాయి. అంచుల్లోంచి పైకి రాలేక ఊపిరాడక చనిపోతే.. ఆ మొక్క వాటిని జీర్ణం చేసుకుంటుంది.
ఈ మొక్క ఆకులపై మంచు బిందువుల్లా మెరిసే జిగురు చుక్కలుంటాయి. ఆ మెరుపును చూసి నీరు అనుకుని వచ్చే పురుగులు ఆ జిగురుకు అతుక్కుపోతాయి. పురుగు తప్పించుకోవడానికి ప్రయత్నించే కొద్దీ ఆకు చుట్టుకుపోయి మరింత గట్టిగా బంధిస్తుంది.
ఇది ఎక్కువగా నీటిలో తేలియాడే మొక్క. దీనికి చిన్న చిన్న సంచుల వంటి బ్లాడర్లు ఉంటాయి. నీటిలోని చిన్న జీవులు దీని వాకిలిని తాకగానే, వాక్యూమ్ క్లీనర్లా సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆ జీవిని లోపలికి లాగేసుకుంటుంది. భూమిపై అత్యంత వేగంగా వేటాడే మెకానిజం దీని సొంతం.
FAQ
ప్రశ్న: కీటకాహార మొక్కల గురించి మొదటిసారి పుస్తకం రాసింది ఎవరు?
జవాబు: చార్లెస్ డార్విన్ (1875లో Insectivorous Plants అనే పుస్తకం రాశారు).
ప్రశ్న: భారతదేశంలో పిచ్చర్ ప్లాంట్ సహజంగా ఎక్కడ కనిపిస్తుంది?
జవాబు: మేఘాలయలోని ఖాసీ కొండల్లో.
ప్రశ్న: ఈ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయా?
జవాబు: అవును, వీటికి పత్రహరితం ఉంటుంది. ఆహారం తయారు చేసుకుంటాయి కానీ నైట్రోజన్ లోపం కోసమే జంతువులను తింటాయి.