Video Viral: అరెరే ఎంత పనాయెరా.. ఆకాశంలో ఎగురుతున్న విమానం రోడ్డుపై దూసుకొచ్చింది.. కట్ చేస్తే

|

Aug 22, 2022 | 7:06 AM

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫన్నీ వీడియో ప్రజలను నవ్విస్తుంది. మరికొన్ని వీడియోలు ఆవేదనతో కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇతర వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రమాదానికి...

Video Viral: అరెరే ఎంత పనాయెరా.. ఆకాశంలో ఎగురుతున్న విమానం రోడ్డుపై దూసుకొచ్చింది.. కట్ చేస్తే
Plane Crash Video
Follow us on

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫన్నీ వీడియో ప్రజలను నవ్విస్తుంది. మరికొన్ని వీడియోలు ఆవేదనతో కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇతర వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియోలను మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒక్కోసారి రోడ్డుపై రెండు కార్లు ఢీకొనడం, బైక్ రైడర్లు స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురవడం, కొన్ని ప్రమాదాలు జరిగి వాహనాలు బాగా దెబ్బతినడంతోపాటు మనుషులు చనిపోవడం వంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. అయితే.. విమాన ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక చిన్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురై రోడ్డుపైనే పడిపోయింది. రోడ్డు నుంచి కొన్ని అడుగుల ఎత్తులో విమానం ఎగురుతున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. విమానం అదుపుతప్పి రోడ్డు వైపు దూసుకువస్తుంది. బ్యాలెన్స్ కోల్పోయి విమానం రోడ్డుపైనే కూలిపోతుంది. కాగా.. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో విమానం ఏ వాహనంపై పడకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

విమాన ప్రమాద ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో క్రేజీ ట్వీట్స్ అనే ఐడీతో పోస్ట్ అయింది. చాలా రద్దీగా ఉండే రహదారిలో క్రాష్ సమయంలో నైపుణ్యం కలిగిన పైలట్ డ్రైవ్‌ వే లోని అన్ని కార్లను తప్పిస్తాడని ట్యాగ్ చేశారు. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు చూస్తున్నారు. కేవలం 8 సెకన్ల ఈ వీడియో చాలా ఆశ్చర్యంగా ఉంది. వీడియో చూసిన తర్వాత యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..