‘పట్టు రా పట్టు హైలెస్సా.. గట్టిగా పట్టు హైలెస్సా..’ అంటూ చేసే శ్రమను తగ్గించుకునేందుకు.. ఇలా కేకలు పెడుతూ.. వారిలో జోష్ పెంచుకుంటుంటారు శ్రామికులు. ముఖ్యంగా పల్లెటూరులోని పొలం గట్లపై భారీ మోత పనులు చేసే రైతులు, రైతు కూలీలు ఈ పదంను ఎక్కువగా ఉపయోగిస్తూ, అలసటను మరిచిపోతుంటారు. అయితే కేవలం గ్రామాల్లోనే ఇలాంటి సీన్లు మనకు కనిపిస్తుంటాయి. అయితే తాజాగా ముంబైలోని ఓ కాలనీ వాసులు, బాటసారులు యాక్సిండెంట్ అయి బోల్తా పడిన కారును పైకి లేపేందుకు ఇలాంటి ఓ పల్లెటూరీ క్యాచీ పదాన్ని ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. సౌత్ ముంబైలోని వాల్‌కేషర్ ప్రాంతంలో ఓ కారు బోల్తా పడింది. దీంతో భారీ మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక చేసేది ఏమి లేక, ఆ కాలనీ వాసులు అటుగా వెళ్తున్నవారు …ఆ కారును పైకి లేపేందుకు ముందుకు వచ్చారు. కారును పైకిలేపుతూ.. ‘ధమ్ లగేగా, అభి లగేగ హైస్సా..’ అంటూ బోల్తా పడిన కారును సరైన క్రమంలో ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
Also Read: సో క్యూట్.. పక్షులతో ఆడుకుంటున్న బుల్లి ఏనుగు భలే.. భలే..!