బిర్యానీ తింటూ ఫ్లైట్ మిస్.. జపాన్ చెఫ్ ఒసావా సక్సెస్ స్టోరీ!

లైఫ్‌లో టర్నింగ్ ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేం. బయోఫ్యూయల్ కంపెనీలో జాబ్ చేసుకునే తకమాస ఒసావా లైఫ్‌లో కూడా అలానే ఓ సాలిడ్ టర్నింగ్ పడింది. అతని సక్సెస్ వెనుక క్రేజీ స్టోరీ ఇదే. 2009లో హాలిడే ట్రిప్ మీద మన ఇండియాలోని కోయంబత్తూరుకి వెళ్లాడు. అక్కడ ఫస్ట్ టైమ్ బిర్యానీ టేస్ట్ చేశాడు.

బిర్యానీ తింటూ ఫ్లైట్ మిస్.. జపాన్ చెఫ్ ఒసావా  సక్సెస్ స్టోరీ!
Viral Japanese Chef Biryani Story

Updated on: Sep 09, 2026 | 9:04 PM

 చిన్నప్పటి నుంచి అన్నం అంటే పిచ్చి ఉన్న అతనికి, ఆ మసాలాలు, ఆ అరోమా అలా మైండ్ బ్లాంక్ చేసేశాయి. ఆ దెబ్బతో ఎక్కడికి వెళ్లినా బిర్యానీ ఆర్డర్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆ లవ్‌ కాస్తా చివరకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్‌ని పెంచింది. అలా ఇండియన్ ఫుడ్ మీద ఉన్న ప్యాషనే.. 2021లో టోక్యోలో కేవలం 10 సీట్లు మాత్రమే ఉన్న బిర్యానీ ఒసావా’ అనే చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేసేలా చేసింది.

ఒక్క వంటకం.. జీవితాంతం సాధన

 

జపాన్‌లో వందల ఏళ్లుగా వస్తున్న  ‘డో’ (Do) సాంప్రదాయాన్ని ఒసావా అలవరుచుకున్నాడు.  డో అంటే జీవితాన్ని ఒక మార్గంగా ఎంచుకోవడం. టీ సెరిమనీ, ఫ్లవర్ డెకరేషన్ లేదా సుషీ లాంటి సింగిల్ డిష్ చేసే చెఫ్‌లు జీవితాంతం కేవలం ఆ ఒక్కదాని మీదే ప్రాక్టీస్ చేస్తూ మాస్టర్స్ అవుతారు. ఒకే పనితో లేదా ఒకే డిష్‌తో సంవత్సరాల తరబడి కనెక్ట్ అయి ఉండటం వల్ల మనిషి సెన్సెస్, స్కిల్స్ దానంతట అవే నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ అవుతాయని ఒసావా గట్టిగా నమ్ముతాడు. “నిన్నటి కంటే ఈరోజు నా వంటకాన్ని ఇంకొంచెం బెటర్‌గా ఎలా చేయాలి అని ఆలోచించడమే మా జపనీస్ కల్చర్” అని చెబుతుంటాడు. ఎంచుకున్న పనిలో పరిపూర్ణత కోసం జీవితాంతం కష్టపడే ఈ జపనీస్ డెడికేషనే ఒసావాను గ్రేట్ చెఫ్‌గా మార్చింది!

అసలైన గురువులు వారే 

పెద్ద పెద్ద పబ్లిసిటీలు, పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడకుండా.. కేవలం నిశ్శబ్దంగా, అంకితభావంతో బిర్యానీ వండే సాధారణ వంటవారే తనకు అసలైన గురువులని ఒసావా అంటుంటాడు. బిర్యానీ మీద ఉన్న ఆ అబ్సెషన్‌తో ఆయన లాహోర్, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ లాంటి చారిత్రక నగరాల్లో పర్యటించి మరీ అక్కడి ఒరిజినల్ రుచులను నేర్చుకున్నాడు.

ఫ్లైట్ మిస్సయిన మూమెంట్

 

 ఒకసారి ఢిల్లీలో ఓ చోట లోకల్ బిర్యానీ తింటున్నప్పుడు ఆ టేస్ట్‌లో ఎంతలా లీనమైపోయాడంటే, చుట్టూ ఏం జరుగుతుందో కూడా మరిచిపోయాడు.  చివరికి తన ఫ్లైట్‌ను కూడా మిస్ చేసుకున్నాడు! జపాన్‌లో ఫస్ట్ టైమ్ బిర్యానీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒసావాకు ఊహించని క్వశ్చన్స్ ఎదురయ్యాయి. అక్కడి వాళ్లకు బిర్యానీ అంటే ఏంటో తెలియక “కూర ఎక్కడ భయ్యా?”, “ఫ్రైడ్ రైస్‌కి, దీనికి తేడా ఏంటి?” అంటూ రకరకాలుగా అడిగారట.

భారతీయులే బిగ్గెస్ట్ టెస్ట్

 

మన ఇండియన్స్‌కి బిర్యానీ అంటే కేవలం ఫుడ్ కాదు, ఒక ఎమోషన్ కాబట్టి.. అసలైన టేస్ట్ ఏంటో వాళ్లకు తెలుసు. అందుకే ఇండియన్ కస్టమర్స్‌కి వడ్డించడం అంటే తనకు బిగ్గెస్ట్ టెస్ట్ అని ఒసావా అంటాడు. ఒకవేళ ఏదైనా కస్టమర్ బిర్యానీని సగం తిని వదిలేస్తే.. అతను అస్సలు ఫీల్ అవ్వడట. దాన్నే ఛాలెంజ్‌లా తీసుకుని, “నా వంటలో ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఎలా చేయాలి” అని ఆలోచించి వెంటనే రిసిపీని మరింత ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఎదురయ్యే విమర్శలను కూడా సక్సెస్‌కి మెట్లుగా మార్చుకునే ఈ జపనీస్ చెఫ్ డెడికేషనే అతన్ని అసలైన బిర్యానీ మాస్టర్‌గా నిలబెట్టింది!

హైదరాబాదీ బిర్యానీ, కోల్‌కతా మసాలాలు, బాస్మతి బియ్యం వండే విధానం, పాకిస్తానీ గ్రేవీ, బలూచిస్తానీ పద్ధతిలో మాంసం మెత్తగా చేయడం, తమిళనాడు స్టయిల్లో రుచి వంటి బెస్ట్  అంశాలన్నింటినీ కలిపి తన స్టయిల్లో అద్భుతమైన బిర్యానీని తయారు చేస్తాడు. వేరే దేశంలో పుట్టినా, మన దేశంలోని ప్రతి మూలన ఉన్న బిర్యానీ సీక్రెట్స్‌ని ఒడిసిపట్టి టోక్యోలో అదరగొడుతున్న ఒసావా అప్రోచ్ నిజంగా నెక్స్ట్ లెవెల్.

Loading...
Unable to load recommendations.
Follow Us