పని ఒత్తిడి కారణంగా తరచూ నిద్రపోతోన్న మీ మెదడు సామర్ధ్యాన్ని ఇట్టే యాక్టివ్ చేయొచ్చు. ఫోటో పజిల్స్.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోన్న హాట్ టాపిక్. ఇవి మనకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాదు.. మెదడు సామర్ధ్యాన్ని 100 రెట్లు పెంచుతాయి. ఇలాంటి ఫోటో పజిల్స్ చిన్న పిల్లలను మాత్రమే కాదు.. పెద్దలను కూడా ఆకట్టుకుంటాయి. ఇవి ఒక్కటే కాదు.. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన మ్యాథ్స్ లెక్కలు లాంటివి కూడా కొన్ని వాడుకలో ఉన్నాయి. ఇలాంటి పజిల్స్ మనల్ని కష్టమైన పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడాలో చెబుతాయి. మరి అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..?
వైరల్ అవుతోన్న ఫోటోలో మీకు ఓ అటవీ ప్రాంతం కనిపిస్తోంది కదూ..! ఇక ఆ ప్రదేశంలో మూడు జింకలు ఉన్నాయి. అవి తమ ఆకలిని తీర్చుకుంటుంటే.. తన ఆకలిని తీర్చుకునేందుకు కాపు కాసుకుంది చిరుత. అవునండీ.! ఓ చిరుత జింకలను వేటాడటానికి ఎదురుచూస్తోంది. దాన్ని కనిపెట్టడమే మీ టాస్క్. అది ఎక్కడుందో 9 సెకన్లలో చెప్పాలి. అలా కనిపెడితే మీవి డేగ కళ్లు అనమాట. మీరు కనిపెట్టగలిగారా.? అయితే సూపర్బ్. ఒకవేళ కనిపెట్టలేకపోతే.? సమాధానం కోసం ఈ కింద ఫోటో చూడండి. మేమే మీకు శ్రమ కలిగించకుండా ఆన్సర్ ఫోటో పెట్టేశాం.
ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే
Here is the answer pic.twitter.com/6SnTljJxbk
— telugufunworld (@telugufunworld) July 23, 2024
ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి