Video Viral: కొంచెం కూడా జాలనిపించలేదా.. పూజారి తీరుపై మండిపడుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..

|

Sep 11, 2022 | 9:25 PM

ఆలయ బాగోగులతో పాటు, భక్తుల పట్ల, చిన్నారులతో ప్రేమగా వ్యవహరించాల్సిన పూజారి క్రూరంగా ప్రవర్తించాడు. స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాన్ని దొంగిలించాడన్న కారణంతో బాలుడిని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. తాను..

Video Viral: కొంచెం కూడా జాలనిపించలేదా.. పూజారి తీరుపై మండిపడుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
Attack On Boy
Follow us on

ఆలయ బాగోగులతో పాటు, భక్తుల పట్ల, చిన్నారులతో ప్రేమగా వ్యవహరించాల్సిన పూజారి క్రూరంగా ప్రవర్తించాడు. స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాన్ని దొంగిలించాడన్న కారణంతో బాలుడిని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. తాను తీయలేదని లబోదిబోమంటున్నా పూజారికి జాలి కలగలేదు. నిజం చెప్పాలంటూ చావబాదాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అతని తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ ప్రసాదం ఏమిటో తెలుసా.. బాదంపప్పు.. మధ్యప్రదేశ్ లోని సాగర్ లో ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి నిమాసముంటున్నాడు. అతనికి ఓ కుమారుడు ఉన్నాడు. అదే ప్రాంతంలోని జైన దేవాలయంలో పూజారిగా రాకేశ్ జైన్ కైంకర్యాలు నిర్వర్తిస్తున్నాడు. అతను రోజు స్వామివారికి నైవేద్యం సమర్పించేవాడు. ఈ క్రమంలో ప్రసాదంగా బాదంపప్పును ఇవ్వాలనుకున్నాడు. అయితే అతనికి బాదంపప్పు కనిపించలేదు. దీంతో అక్కడే ఉన్న బాలుడు దొంగిలించి ఉంటాడని భావించాడు. అతని దగ్గరికి వెళ్లి ఎందకు తీశావని ప్రశ్నించాడు. తాను తీయలేదని, విడిచి పెట్టాలని కోరుకున్నా పూజారి కనికరించలేదు. బాలుడిని బలవంతంగా లాక్కొ్చ్చి చెట్టుకు కట్టేశాడు. అంతటితో ఆగకుండా కసితీరా చావబాదాడు. మరో యువకుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

చిన్నారిని కొడుతున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం గమనార్హం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పూజారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. పూజారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..