Viral Video: ప్రాణం తీసిన బంగీ జంప్‌..! దారుణం ఆ మహిళ.. షాకింగ్‌ వీడియో..

Viral Video: బంగీ జంప్‌ లాంటి ఫీట్లు అందరికి సాధ్యం కాదు. ఇలాంటివి చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కొంతమంది ప్రాణాలను పనంగా పెట్టి ఈ జంప్‌లను

Viral Video: ప్రాణం తీసిన బంగీ జంప్‌..! దారుణం ఆ మహిళ.. షాకింగ్‌ వీడియో..
Bungee Jump

Updated on: Oct 12, 2021 | 1:02 PM

Viral Video: బంగీ జంప్‌ లాంటి ఫీట్లు అందరికి సాధ్యం కాదు. ఇలాంటివి చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కొంతమంది ప్రాణాలను పనంగా పెట్టి ఈ జంప్‌లను ఆస్వాదిస్తారు. అయితే కొన్నిసార్లు ఇది వికటించవచ్చు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. బంగీ జంపింగ్ సమయంలో ఒక మహిళ బాధాకరమైన ప్రమాదానికి గురై మరణిస్తుంది. ఈ వీడియో కజకిస్తాన్ నుంచి వచ్చింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు.

కజకిస్తాన్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల యెవ్‌జెనియా లియోన్టీవా తన భర్త, స్నేహితులతో కలిసి కరాగండా నగరంలోని ఒక హోటల్‌కు వెళ్లింది. ఈ హోటల్ పైకప్పుపై బంగీ జంపింగ్ అడ్వెంచర్ గేమ్ ఉందని చెప్పారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన యెవ్‌జెనియా ఈ సాహసాన్ని చేయాలనుకుంది. వైరల్ వీడియో క్లిప్‌లో యెవ్‌జెనియా 80 అడుగుల ఎత్తులో పైకప్పుపై నిలబడి ఉన్నట్లు మనం గమనించవచ్చు. బంగీ జంపింగ్‌కు ముందు సిబ్బంది వారి తాడు, ఇతర భద్రతా విధానాలను తనిఖీ చేస్తున్నారు. తరువాత ఎవ్జెనియా అక్కడి నుంచి దూకుతుంది కానీ ఆమె గాల్లో తేలలేదు. డైరెక్ట్‌గా కిందపడి అత్యంత దారుణంగా కింద ఉన్న ఒక గోడకి తగలడం మనం వీడియోలో చూడవచ్చు.

ఎవ్జెనియా భర్త కింద కెమెరాతో షూట్ చేస్తున్నాడు. బంగీ జంప్‌ తన భార్య జీవితంలో చివరిదని బహుశా తెలుసుకోలేకపోయాడు. ఆమె కిందపడటంతో అక్కడ ఉన్న వ్యక్తులు ఆమె వద్దకు పరుగులు తీసి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ శస్త్రచికిత్స చేసే సమయంలో ఆమె మరణించింది. ఈ బాధాకరమైన ప్రమాదం తరువాత పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఇది ప్రమాదమా లేదా హత్యా అనే కోణంలో విచారిస్తున్నారు. అదే సమయంలో బంగీ జంపింగ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదైంది. రెండు తాళ్లలో ఒకటి తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు.

SBI Tractor Loan: రైతులకు ఎస్‌బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ట్రాక్టర్‌ కోసం వందశాతం రుణం.. పూర్తి వివరాలు..!

Loading...
Unable to load recommendations.
Follow Us