మనుషులకు కోతులకు అతిదగ్గర పోలిక ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే మనుషులు ఒకేరకమైన కోతుల నుంచే వచ్చారని డార్విన్ సిద్దాంతం. చాలా సందర్భాల్లో కోతి చేసే పనులు మనుషులను తలపిస్తాయి. అందుకే అల్లరి ఎక్కువగా చేసే పిల్లలను కోతి చేష్టలు అంటూ కామెంట్ చేస్తారు. వాస్తవానికి కోతులు చాలా తెలివైనవి. చురుకైనవి. కొన్ని సార్లు మనుషులకంటే చాలా తెలివైనవి అనిపిస్తాయి. ఈజీగా మనుషులను కూడా మోసగిస్తాయి. ఇప్పటి వరకూ మందు తాగుతున్న కోతిని, ముగ్గులు పెడుతున్న కోతి.. సెల్ చూస్తున్న కోతి ఇలా రకరకాల కోతులను చూశారు. కానీ బస్సులో, అది కూడా కిటికీ ఉన్న సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న కోతిని ఎప్పుడైనా చూశారా? ఇప్పటి వరకూ చూడకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్ వేయండి. బస్సులో ఆనందంగా ప్రయాణిస్తున్న కోతి కనిపిస్తుంది.
ఓ బస్సులో ప్రయాణీకులతో పాటు ఓ కోతి కూడా ప్రయాణిస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే.. సీటు లేక చాలామంది బస్సులో నిల్చున్నారు. కానీ కోతి మాత్రం హాయిగా ఆనందంగా కిటికీ ఉన్న సీటు దగ్గర కూర్చుని ప్రయాణిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. తెరిచిన కిటికీలోంచి కోతి ప్రయాణిస్తున్న తీరు ఆశ్చర్యకరమైన విషయం. అది కూడా కదులుతున్న బస్సులో నుంచి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తుంది. కోతి కూడా మనుషుల మాదిరిగానే మళ్లీ మళ్లీ కిటికీ నుంచి బయటకు చూస్తూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.
ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಮಹಿಳೆಯರಿಗೆ ಬಸ್ ಪ್ರೀ ಅಂದಿದ್ದರ ಪರಿಣಾಮ
ಹಾವೇರಿ To ಹಿರೇಕೆರೂರಿಗೆ 30 KM ಬಸ್ನಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿದ ಕೋತಿ.
ಟಿಕೆಟ್ ತಗೋ ಅಂದ್ರೆ ನಾನೂ ಹೆಣ್ಣು ಅಂತಂತೆ..!!
ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ಮರದ ಮೇಲಿದೆ ಅಂತಂತೆ..!!
ಏನೇ ಮಂಗನಿಂದ ಮಾನವ ಅಲ್ಲವೇ ?#Congress #Shakthi #freebus #gurenartes pic.twitter.com/qHyMzt1PoB— ಒಕ್ಕಲಿಗ ( Okkaliga ) (@NanuVokkaliga) October 4, 2023
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించండి. ఈ నేపథ్యంలో బస్సులో ఇతర ప్రయాణీకులతో పాటు ఓ కోతి హవేరీ నుంచి హిరేకెరూరు వరకు 30 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించింది.
బస్సుల్లో ఉన్న ప్రయాణికులు కోతి గురించి మాట్లాడుకుంటున్నారు. కొందరు కోతిని వీడియో తీస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియో కర్ణాటకకు చెందినదని.. కర్ణాటక ప్రభుత్వానికి (KSRTC) చెందినద బస్సు అని ప్రజలు పేర్కొన్నారు.
@NanuVokkaliga అనే వినియోగదారు ద్వారా ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు వందలాది మంది దీనిని చూసి, దీనిపై తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..