Viral Video: పాము-ముంగిస మధ్య భీకరపోరు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. సాధారణంగా పాములు, పులులు, మొసళ్లు, ఇలా జంతువుల వీడియోలు ఎక్కువగా వైరల్‌..

Viral Video: పాము-ముంగిస మధ్య భీకరపోరు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Viral Video

Updated on: Apr 18, 2022 | 4:17 PM

Viral Video: కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. సాధారణంగా పాములు, పులులు, మొసళ్లు, ఇలా జంతువుల వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు (Video) ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంటుంది. పాము (Snake), ముంగిస (Mongoose) మధ్య జరిగే ఫైట్ గురించి మీరు చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటారు. ఇలాంటివి ఎక్కువ పల్లెటూరు జనాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పొలాల మధ్య చాలా సార్లు చూసి ఉంటారు. అయితే ముంగిస ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందో పెద్దగా చెప్పనక్కరలేదు. ఈ రెండు ఒకదానికి ఒకటి ఎదురుపడితే భీకర యుద్దమే జరుగుతుంది. ఈ రెండింటి పోరులో ఎక్కువసార్లు ముంగిసే విజయం సాధిస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్‌ మీడియాలో తిరిగి వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో పంచుకున్నారు. పాము- ముంగిస ఎదురుపడ్డాయంటే చాలు.. ఇక యుద్ధమే.

మిస్టర్ నందా షేర్ చేసిన వీడియోలో ఓ రోడ్డపై ముంగిస, పాము రెండింటి మధ్య భీకరపోరు కొనసాగింది. ముంగిసను కాటేసేందుకు నాగు పాము పదేపదే ప్రయత్నిస్తుండగా, అందుకు ముంగిస కూడా ఏ మాత్రం తగ్గకుండా పోరాటం కొనసాగించింది. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడినప్పటి నుండి ఈ వీడియో ట్విట్టర్‌లో 18,000 మంది వీక్షించారు. ఇక ఇదే వీడియో యూట్యూబ్‌లో ఐదేళ్ల కిందట 6 మిలియన్ల వ్యూస్‌ని సాధించింది.

 

Viral Video: లాక్డౌన్ తో చైనాలో దిగజారుతున్న పరిస్థితులు.. ఆకలితో చేపలు ఎలా పట్టారంటే..

Viral Video: నేనెప్పుడూ చూడలే..! ఈ కోడి గుడ్డుతోనే ఫుట్‌బాల్ ఆడేస్తోంది.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Loading...
Unable to load recommendations.
Follow Us