Viral Video: మీరెప్పుడైనా ఇలాంటి బైక్‌ నడిపారా..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Viral Video: గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఆలోచన విధానాలు చాలా గమ్మత్తుగా, షాకింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే వారు తయారుచేసే

Viral Video: మీరెప్పుడైనా ఇలాంటి బైక్‌ నడిపారా..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Jugaad Bike

Updated on: Aug 27, 2021 | 12:35 PM

Viral Video: గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఆలోచన విధానాలు చాలా గమ్మత్తుగా, షాకింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే వారు తయారుచేసే వస్తువులు, వాహనాలు వింతగా ఉంటాయి. వాటిని చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే అతడి తెలివిని ప్రశంసించకుండా ఉండలేం. ఎందుకంటే పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం సాధ్యం కాని పనులను వీళ్లు సింపుల్‌గా చేస్తారు. వారి సృజనాత్మకత ఆ విధంగా ఉంటుంది. అందుకే వారు నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా ఓ బైక్ పై ఏడుగురు ప్రయాణించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో రోడ్డుపై ఓ బైక్ వెళ్లడం మనం గమనించవచ్చు. అయితే దాని వెనుక సీటుపై ఒక బెంచ్ ఉండటం మనం చూడవచ్చు. ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులు తమను తాము బ్యాలెన్స్ చేసుకుంటూ రద్దీగా ఉండే రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారు. అంతేకాదు బైక్‌ డ్రైవర్ చాలా సౌకర్యవంతంగా బైక్ నడుపుతుండటం మనం చూడవచ్చు. వీరిని చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతూ పరేషాన్ అవుతుంటారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో యూజర్లకు బాగా నచ్చింది. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది వీరిని ప్రమాదకరమైనవారిగా చెప్పారు. ఒక వినియోగదారు ఇలా అన్నాడు ‘హే! ఇది బైకా లేదా ఎస్‌యూవీ ‘ మరొక వినియోగదారు ఇలా రాశారు, ‘ఈ ఫీట్‌ చాలా ప్రమాదకరం’. మరొకరు ఇలా అన్నారు. ‘పెట్రోల్ ధర పెరగడం వల్ల ఇలా జరుగుతుందని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ సృష్టిస్తోంది. వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల తర్వాత అది ఒక లక్షకు పైగా వ్యూస్‌ని పొందింది.

Viral Video: గాల్లోకి లేచిన హెలికాఫ్టర్ ఒక్కసారిగా భూమిపై ఉన్న కారుపై కుప్పకూలింది..!

Rashi Khanna: షూటింగ్‌ విరామంలో రాశీ ఖన్నా ఏం చేస్తుందో చూశారా.? దాని గురించే ఆలోచన..

Train Brake System: రైలుకి బ్రేకులు ఎలా పడుతాయో ఎప్పుడైనా ఆలోచించారా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Loading...
Unable to load recommendations.
Follow Us