ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక మరికొన్ని వీడియోలు ఎంతో భయంకరంగా కనిపిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు నెట్టింట్లో ఏనుగులు, కోతులకు, కుక్క పిల్లలకు సంబంధించిన వీడియో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. అవి చేసే అల్లరి చేష్టలు.. పనులు నవ్వించడమే కాదు.. ఆశ్చర్యపోయేలా చేస్తాయి. అలాగే ఓ మేక చేసిన పనికి ఓ వ్యక్తి ఉద్యోగానికి ఎసరు పెట్టింది.
కమెడియన్ రాజీవ్ నిగమ్ షేర్ చేసిన వీడియోలో ఓ మేక కొన్ని ఆఫీస్ ఫైల్స్ నోటితో పట్టుకుని పరిగెత్తింది. ఆ మేక వెనకాలో ఓ వ్యక్తి పరిగెత్తాడు.. ఎంత దూరం వెళ్లిన ఆ మేకను మాత్రం పట్టుకోలేకపోయాడు. మరీ ఆ కాగితాలు ముఖ్యమైనవి కాకపోతే.. అంతలా ఆ మేక వెంట పడినట్లుగా కనిపిస్తుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు ఓ లుక్కెయ్యండి.
कानपुर भी गज़बे है भाई.. एक बकरी सरकारी कार्यालय से पेपर चबा के भाग रही है और कर्मचारी पीछा कर रहे है pic.twitter.com/ql6Yt0D3aE
— Rajeev Nigam (@apnarajeevnigam) December 1, 2021
Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్.. అడవి తల్లి మాట రిలీజ్ ఎప్పుడంటే..
PushpaTrailer Tease: ట్రైలర్‌కు ముందు పుష్పరాజ్ టీజ్.. ఆకట్టుకుంటోన్న పుష్ప లేటేస్ట్ వీడియో..