
Viral Video: మనిషి ఒక్కోసారి ఎగతాళిగా చేసే పనులు అతడి నాశనానికి కారణమవుతాయి. ఒక్కోసారి కొంతమంది చాలా అతిగా ప్రవర్తిస్తారు. తర్వాత దాని ఫలితాలని చవిచూస్తారు. సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తారు. ఎందుకంటే దానికి ఉండే శక్తి అలాంటిది మరి. అడవిలో ఉండే జంతువులన్నింటి కంటే సింహానికి ఎక్కవ శక్తి ఉంటుంది. దాని గర్జనకు అడవి మొత్తం వణికిపోతుంది. అలాంటిది దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ ఒక వ్యక్తి చేయకూడని తప్పు చేసి చిక్కుల్లో పడిపోయాడు. సింహాన్ని ఆటపట్టించి తగిన శాస్త్రి పొందాడు. ఈ సంఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ అందులో ఏం జరిగిందో తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక జంతుప్రదర్శన శాలలో సింహం బోనులో ఉండటం మనం చూడవచ్చు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సింహాంతో పరాచకాలాడుతుంటాడు. అతడి చేతిని సింహం నోట్లో పెడుతూ తీస్తే ఆటపట్టిస్తుంటాడు. అయితే సింహం ఒక్కసారిగా అతడి చేతిని నోటితో గట్టిగా పట్టుకుంటుంది. ఇంకేముంది ఎంత లాగినా విడిచిపెట్టదు. చివరకి ఆ వ్యక్తి వేలుని పోగట్టుకునే పరిస్థితి దాపురిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటన జమైకా జంతుప్రదర్శనశాలలో జరిగినట్లు భావిస్తున్నారు. దీనిని ఒక నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశారు. అతను క్యాప్షన్ రాశాడు.. ‘నటన కొన్నిసార్లు ఖరీదైనది అవుతుంది.’ ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియోని 16 లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి