
సహజంగా చూడ్డానికి భారీ శరీరం కలిగివున్న ఏనుగులు వాటి చిన్నతనంలో చాలా అల్లరి చేస్తుంటాయి. అయితే హద్దులేని అల్లరి చేస్తూ ఒక్కొసారి పిల్ల ఏనుగులు ప్రమాదంలో కూడా పడుతుంటాయి. అందుకే పిల్ల ఏనుగులు చేసే ప్రతిపనిని తల్లి ఏనుగులు ఓ కంట కనిపెడుతూ.. ప్రతిక్షణం వాటికి రక్షణ కల్పిస్తూ తల్లిప్రేమను చాటుకుంటాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏనుగులకు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్ల ఏనుగులు చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. నిజానికి బుజ్జి ఏనుగులకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే చాలా ముచ్చటగానూ, ఆహ్లాదకరంగానూ అనిపిస్తుంటుంది.
తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పిల్ల ఏనుగు… పక్షులను ఛేజ్ చేస్తూ ఆడుకుంటూ కనిపించింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీడియోని చూసి నెటిజన్లు ‘సో క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరో పిల్ల ఏనుగు సరదాగా ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఏనుగు పిల్ల నదిలో దిగి ఆడుకోడానికి ప్రయత్నించగా.. మొదట తల్లి ఏనుగు, దానితో పాటున్న మరో ఏనుగు నదిలోకి దిగి ఆ పిల్ల ఏనుగు ఆడుకునేందుకు ఆ ప్రాంతం సేఫ్‌గా ఉందా లేదా అని పరిశీలించాయి. ఆ తర్వాత ఏనుగు పిల్లను నీటి లోపలికి తీసుకెళ్లి ఆటాడించాయి.
Also Read: ఈ చిలుక కొబ్బరి బొండంను ఎంత రాయల్‌గా తాగిందో మీరే చూడండి..