Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహం వేట ఇంత దారుణంగా ఉంటుందా..?

అడవికి 'రాజు' సింహం అని మనమందరం చిన్నప్పటి నుంచీ వింటున్నాం. ఆ దర్బం, డాబు దానిలో కనిపిస్తాయి.  సింహం నడక శైలి....

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహం వేట ఇంత దారుణంగా ఉంటుందా..?
Lion Attack

Updated on: Jul 17, 2021 | 9:52 AM

అడవికి ‘రాజు’ సింహం అని మనమందరం చిన్నప్పటి నుంచీ వింటున్నాం. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ దర్బం, డాబు దానిలో కనిపిస్తాయి.  సింహం నడక శైలి, గర్జన శైలి, వేటాడే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సింహం గర్జన వింటేనే మిగతా జంతువులకు వెన్నులో వణుకుపుడుతుంది. దాని వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో తెలియజేసే వీడియోలు ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. డిస్కవరీ ఛానల్‌లో కూడా మీరు ఆ వీడియోలు చూడవచ్చు. తాజాగా అలాంటి వీడియోనే మీ ముందుకు తెచ్చాం.

ముందుగా వీడియోను వీక్షించండి…

ఒక జీబ్రాను వెంటాడి పట్టింది సింహం. ఈ క్రమంలో జీబ్రా కాలు విరిగిపోయింది. బాధ, భయంతో జీబ్రా ఆర్తనాదం చేస్తున్నప్పటికీ సింహం దాన్ని విడవలేదు. పొట్ట భాగంలో చర్మాన్ని తినడం ప్రారంభించింది. తక్కువ సెకన్ల నిడివి ఉన్నప్పటికీ సింహం యొక్క దయలేని గుణం వీడియోలో ప్రస్పుటమవుతుంది. కాగా వేటలో తప్పేముంది, అది అడవి నియమం అన్నది మరికొందరి వాదన. దీంతో తమ విభిన్న వెర్షన్స్‌ ‌ను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు నెటిజన్లు.  ఈ వీడియోను హయత్._వాష్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆర్టికల్ రాసే సమయం వరకు సుమారు 50 వేల మంది ఈ వీడియోను చూశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ వీడియోపై ఓ లుక్కేసి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Also Read: కోడే కదా అని భయపెట్టాలని చూశాడు.. అది బుడ్డోడ్ని 3 చెరువుల నీళ్లు తాగించింది

సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పిన ప్రియమణి

 

Loading...
Unable to load recommendations.
Follow Us