Viral Video: ఎలుగుబంటిని వేటాడిన సింహం.. వీడియో మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు.!

అడవిలో ఎప్పుడూ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎక్కడ నుంచి ఏ క్రూర జంతువు వేటాడుతుందోనని మిగతా జంతువులు భయపడుతుంటాయి...

Viral Video: ఎలుగుబంటిని వేటాడిన సింహం.. వీడియో మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు.!
Lion Vs Bear
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2021 | 1:22 PM

అడవిలో ఎప్పుడూ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎక్కడ నుంచి ఏ క్రూర జంతువు వేటాడుతుందోనని మిగతా జంతువులు భయపడుతుంటాయి. సాధారణంగా సింహం, పులి, మొసలి, చిరుత వంటి ప్రమాదకరమైన జంతువులు.. చిన్న జంతువులను ఎరగా చేసుకుంటాయి. అయితే మీరెప్పుడైనా సమవుజ్జీల పోరాటాన్ని చూశారా.? ఓ ఎలుగుబంటిని సింహం వేటాడటం చూశారా.? ఆ పోరు ఎలా ఉంటుందో తెలుసా.? ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.

సింహం అడవికి రారాజు. మృగరాజు గర్జన వింటే చాలు మిగతా జంతువులు హడలిపోతాయి. అంతేకాకుండా సింహం వేటకు దిగితే వార్ వన్ ‌సైడ్ అయిపోవాల్సిందే. అయితే ఇక్కడ కాస్త రివర్స్ అయింది. వైరల్ వీడియో ప్రకారం.. పొదల చాటున నక్కిన ఓ సింహం.. దూరం నుంచి ఎలుగుబంటిని చూస్తుంది. ఎలాగైనా దాన్ని వేటాడాలని నిర్ణయానికి వస్తుంది. ఒక్కసారిగా మెరుపు దాడికి దిగుతుంది. అయితే ఎలుగుబంటి కూడా తక్కువేం కాదు. సింహానికి సరైన సమవుజ్జీ.. దానితో పోరాడుతుంది. ఎదురుదాడికి దిగుతుంది. తన కాళ్లతో సింహాన్ని తన్నుతూ.. తనను తాను రక్షించుకుంటుంది. అయితే చివర్లో ఈ రెండు జంతువులు.. చెరో దారిలో పారిపోవడం గమనార్హం. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..