viral Video: న‌డి రోడ్డుపై హ‌ల్చ‌ల్ చేసిన భారీ కొండచిలువ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

viral Video: సాధార‌ణంగా ఓ చిన్న పాము క‌నిపిస్తేనే తుర్రుమ‌ని అక్క‌డి నుంచి పారిపోతుంటాం. అలాంటిది ఆరడుగుల ఓ భారీ పైథాన్ క‌నిపిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది. ఊహించుకోవ‌డానికే షాకింగ్‌గా ఉంది క‌దూ...

viral Video: న‌డి రోడ్డుపై హ‌ల్చ‌ల్ చేసిన భారీ కొండచిలువ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Edited By: Anil kumar poka

Updated on: Jan 13, 2022 | 8:37 AM

viral Video: సాధార‌ణంగా ఓ చిన్న పాము క‌నిపిస్తేనే తుర్రుమ‌ని అక్క‌డి నుంచి పారిపోతుంటాం. అలాంటిది ఆరడుగుల ఓ భారీ కొండచిలువ (Python Video) క‌నిపిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది. ఊహించుకోవ‌డానికే షాకింగ్‌గా ఉంది క‌దూ. కానీ తాజాగా ఇలాంటి ఓ కొండచిలువ అంద‌రూ చూస్తుండ‌గానే ఎంచ‌క్కా రోడ్డు దాటేసింది. కొచ్చిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. గత ఆదివారం కొచ్చిలోని సీపోర్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్ వెళ్లే దారిలో ఓ భారీ పైథాన్ క‌నిపించింది. సుమారు 6 అడుగులు ఉన్న పైథాన్ రోడ్డు దాటుతోంది.

దీంతో రోడ్డుపై భారీ పామును చూసిన వాహ‌నదారులు వెంట‌నే వెహికిల్స్‌ను ఆపాల్సి వ‌చ్చింది. వాహ‌న‌దారులంతా త‌మ ఫోన్‌ల‌ను బ‌య‌ట‌కు తీసి రోడ్డు దాటుతోన్న పైథాన్‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియా తీశారు. అనంత‌రం నెమ్మ‌దిగా రోడ్డు దాటిన ఆ పాము చెట్ల‌లోకి వెళ్లిపోవ‌డంతో వాహ‌నదారులు వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఈ భారీ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే కొచ్చి శివారుల్లో ఇటీవ‌ల పాములు క‌నిపించ‌డం ఎక్కువ‌వుతోందని అధికారులు చెబుతున్నారు. వారంలో క‌నీసం మూడు సార్లు పైథాన్ కనిపించిదంటూ ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయని చెబుతున్నారు.

Also Read:  Digital News Round Up: చిరుతకు చుక్కలు చూపించిన అడవి పంది | మొసలితో ఆటలంటే తమాషా అనుకున్నడు ! లైవ్ వీడియో

Telangana Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్ !! రుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు !! వీడియో