Viral Video: వామ్మో ఇదేం కోడి రా సామి.. పామును నూడిల్స్‌లా మింగేసింది.. ఇదిగో వీడియో
సోషల్ మీడియాలో తరచూ అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జనాలను ఆశ్చన్యానికి గురిచేస్తే.. మరికొన్ని వింత అనుభవాన్ని కలిగిస్తాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడో కోడి విషపూరితమైన కింగ్ కోబ్రా పిల్లతో భీకరంగా పోరాడుతుంది. కానీ చివరకు ఆ కోడి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది.

సాధారణంగా మన పరిసరాల్లో ఉండే కోళ్లు పాములు వంటి వాటిని చూస్తే భయపడిపోతాయి. కానీ నార్త్ ఇండియాలో ఎక్కవగా పెరిగే కడక్‌నాథ్ అనే ఈ కోళ్లు ఏకంగా పాములకే ఎదురెళ్లి పోరాడుతాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో కోడి తన పదునైన ముక్కుతో క్షణాల్లో పామును చంపేస్తుంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఒక నల్లటి కోడి బయట తిరుగుతూ ఉండగా సడెన్‌గా అక్కడికి ఓ పాము పిల్ల వస్తుంది. దాన్ని గమనించిన ఆ నల్ల కోడి క్షణాల్లో దానిపై దాడికి దిగుతుంది. ఆ పాము సైతం కోడి తన స్థాయికి మించి పోరాడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ కోడి తన పదునైన ముక్కుతో ఆ పాము తలపై పదే పదే బలంగా కొడుతూ.. దాన్ని చంపేస్తుంది. ఏకంగా దాన్ని నోట్లో వేసుకొని తినేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈ కోడి దాడికి తీవ్రంగా గాయపడిన పాము పిల్ల.. గిలగిలా కొట్టుకొని ప్రాణాలు కోల్పోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. పాము పిల్ల చిన్నది కాబట్టి.. ఆ కోడి దాన్ని ఈజీగా చంపగలిగిందని.. దాని ప్లేస్‌లో పెద్ద పాము ఉంటే.. ఆ కోడి సంగతి చూసేదని కొందరు కామెంట్ చేయగా.. విషపూరితమైన పామును తిన్న ఆ కోడికి ఏం కాకపోవడమేంటని కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు.
వీడియో చూడండి..
View this post on Instagram
కడక్‌నాథ్ కోడి ప్రత్యేకత
అయితే ఈ కడక్‌నాథ్ అనే కోళ్లు ఎక్కవగా నార్త్ ఇండియాలో లేదా విదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి మితగా కోళ్లతో పోల్చుకుంటే చాలా బిన్నంగా ఉంటాయి. ఈ కోడి ఈకలు, చర్మం, మాంసం, ఎముకలు, రక్తం కూడా నలుపు రంగులో ఉంటాయి. దీని మాంసంలో ప్రొటీన్లు ఎక్కువగాను, కొవ్వు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగాను ఉంటాయి. ఔషధ గుణాలు ఉండటం వల్ల దీనికి మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




