
టెక్నాలజీ మన జీవితంలో ఎంతగా భాగమైందో చెప్పడానికి రోబోల వాడకమే నిదర్శనం. కానీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే మాత్రం కొత్త సందేహాలు కలిగిస్తుంది. ఇప్పుడు రోబోట్‌లకు భావోద్వేగాలు పుట్టుకొచ్చాయా..? అవి మనుషులలా ప్రవర్తించడం మొదలుపెట్టాయా? అని అనిపిస్తోంది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…
చైనాలోని షాన్‌క్సీ ప్రావిన్స్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన డ్యాన్స్ షో సందర్భంగా ఒక వింత సంఘటన జరిగింది. లైవ్‌షోజరుగుతున్నప్పుడు, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అకస్మాత్తుగా తన ప్రోగ్రామింగ్‌ను మరచిపోయి, పక్కనే నిలబడి ఉన్న ఒక విద్యార్థిని కౌగిలించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ వీడియో చూసిన తర్వాత, ప్రజలు ఏఐ (AI) భద్రతపై చర్చిస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే:
చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో, మానవరూప రోబోట్ డ్యాన్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. మీడియా నివేదికల ప్రకారం, అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో, ఆ రోబోట్ అకస్మాత్తుగా తన స్థానం నుండి కదిలి, సమీపంలో నిలబడి ఉన్న ఒక విద్యార్థిని వద్దకు వెళ్లి, ఆమెను కౌగిలించుకుంది. ఆ రోబోట్‌ను కేవలం డ్యాన్స్ కోసమే ప్రోగ్రామ్ చేసినందున, అక్కడున్న వారి అంచనాలకు మించిన రీతిలో ఈ చర్య జరిగింది. రోబో విద్యార్థినిని పట్టుకోగానే, అక్కడి సిబ్బంది వెంటనే స్పందించి రోబోను ఆమె నుండి వేరు చేశారు. అదృష్టవశాత్తు, ఈ ఘటనలో విద్యార్థినికి ఎలాంటి గాయాలు కాలేదు, కానీ ఆ దృశ్యం అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. రోబో స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందా లేక ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా..? అని చాలామంది ప్రశ్నించారు. కొంతమంది వినియోగదారులు దీనిని యంత్ర సహజ ప్రవృత్తి అని పేర్కొనగా, మరికొందరు దీనిని సిస్టమ్ లోపం అని అన్నారు. నివేదికల ప్రకారం, ఆ రోబోట్‌ను ఒక నిర్దిష్ట పనితీరు కోసం రూపొందించారు. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు అంటున్నారు. కొంతమంది నిపుణులు దీనికి సాఫ్ట్‌వేర్ లోపం లేదా సిగ్నల్ అంతరాయం కారణమని ఆపాదిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు రోబోలకు సొంత తెలివితేటలు వచ్చాయని జోకులు వేయగా, నిపుణులు మాత్రం దీనిని సాంకేతిక లోపంగానే చూస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
During a performance a university sports event in Shaanxi, a dancing robot suddenly turned and hugged a female dancer beside it before staff quickly stepped in and pulled it away. The clip sparked jokes online, with some asking: “Has it developed self-awareness already?!” pic.twitter.com/E1NsYZ4EGg
— Shanghai Daily (@shanghaidaily) April 24, 2026
ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. మానవరూప రోబోట్ ప్రవర్తనపై ప్రశ్నలు తలెత్తడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో రోబోట్లు అనుకోకుండా మనుషులపై అసాధారణ చర్యలు చేసిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనివల్ల ఈ సాంకేతికత ఇంకా పూర్తిగా సురక్షితం కాదని స్పష్టమవుతోంది. కొత్త చర్చకు ఆరంభం ఈ సంఘటన తర్వాత, ఏఐ, రోబోట్‌ల భద్రతపై చర్చ తీవ్రమైంది. రోబోట్‌లను ప్రజల మధ్య ఉపయోగించాలంటే, వాటికి పటిష్టమైన భద్రతా వ్యవస్థలు, నియంత్రణ యంత్రాంగాలు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…