ఒకే ఒక్క టికెట్‌తో మారిన జాతకం..రాత్రికి రాత్రే రూ.8,700 కోట్ల భారీ పవర్‌బాల్ జాక్‌పాట్

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పడం కష్టం. అమెరికాలోని ఇల్లినోయ్స్ రాష్ట్రంలో కొనుగోలు చేసిన ఒకే ఒక్క పవర్‌బాల్ లాటరీ టికెట్ ఒక సామాన్యుడిని రాత్రికి రాత్రే వేల కోట్ల అధిపతిగా మార్చేసింది. బుధవారం రాత్రి జరిగిన డ్రాలో ఈ టికెట్ మైండ్ బ్లోయింగ్ రీతిలో 1.04 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.8,700 కోట్లు) జాక్‌పాట్‌ను కైవసం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకే ఒక్క టికెట్‌తో మారిన జాతకం..రాత్రికి రాత్రే రూ.8,700 కోట్ల భారీ పవర్‌బాల్ జాక్‌పాట్
Powerball Jackpot

Updated on: Aug 13, 2026 | 3:10 PM

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేం. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన ఓ పవర్‌బాల్ లాటరీ టికెట్ హోల్డర్‌కు తాజాగా అలాంటి అదృష్టమే వరించింది. బుధవారం రాత్రి జరిగిన పవర్‌బాల్ డ్రాలో ఒకే టికెట్ అన్ని ఆరు నంబర్లను సరిగ్గా మ్యాచ్ చేసి ఏకంగా 1.04 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,900 కోట్లకు పైగా) జాక్‌పాట్‌ను గెలుచుకుంది. ఇది 2026లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పవర్‌బాల్ జాక్‌పాట్‌గా నిలిచింది.

డ్రాలో వచ్చిన విజేత నంబర్లు 4, 26, 66, 67, 69 కాగా, రెడ్ పవర్‌బాల్ నంబర్ 9. ఇల్లినాయిస్‌లో విక్రయించిన టికెట్ ఈ ఆరు నంబర్లను మ్యాచ్ చేయడంతో మొత్తం జాక్‌పాట్ ఆ టికెట్‌కే దక్కింది. అయితే ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. విజేత వయసు, స్వస్థలం, వృత్తి, టికెట్‌ను ఒంటరిగా కొనుగోలు చేశారా లేదా గ్రూప్‌గా కొనుగోలు చేశారా అనే వివరాలు కూడా అధికారికంగా వెల్లడించలేదు.

విజేతకు రెండు ఆప్షన్లు:

ఇంత భారీ బహుమతిని గెలుచుకున్న విజేతకు నగదు తీసుకునే విషయంలో రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటిది మొత్తం జాక్‌పాట్‌ను 29 ఏళ్ల కాలంలో వార్షిక వాయిదాల రూపంలో తీసుకోవడం. రెండోది ఒకేసారి నగదు రూపంలో తీసుకోవడం. నగదు ఆప్షన్ ఎంచుకుంటే పన్నులకు ముందు సుమారు 450.5 మిలియన్ డాలర్లు అందుతాయి. ఈ రెండు మొత్తాలపైనా వర్తించే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

44 డ్రాల తర్వాత జాక్‌పాట్ విజయం:

ఈ విజయం మరొక కారణంతోనూ ప్రత్యేకంగా నిలిచింది. మే 2 తర్వాత వరుసగా 44 డ్రాల్లో పవర్‌బాల్ జాక్‌పాట్‌ను ఎవరూ గెలుచుకోలేకపోయారు. దీంతో బహుమతి మొత్తం క్రమంగా పెరుగుతూ చివరకు బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. తాజా విజయం ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.ఈ 1.04 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ పవర్‌బాల్ చరిత్రలో ఎనిమిదో అతిపెద్దదిగా నమోదైంది. అయితే విజేత స్వయంగా ముందుకు వచ్చి టికెట్‌ను క్లెయిమ్ చేసే వరకు ఆయన లేదా ఆమె గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్న అవకాశం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us