Funny Video: భార్య చెప్పే పనులు చేయలేక ఈ తుంటరి భర్త ఏం చేశాడంటే..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

|

Sep 11, 2021 | 3:20 PM

Funny Video: భార్యా భర్తల సంబంధం కలకాలం ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఎంత ఎక్కువైతే అన్ని గొడవలు జరుగుతుంటాయి. సోషల్‌ మీడియాలో భార్యాభర్తలకు

Funny Video: భార్య చెప్పే పనులు చేయలేక ఈ తుంటరి భర్త ఏం చేశాడంటే..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Video
Follow us on

Funny Video: భార్యా భర్తల సంబంధం కలకాలం ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఎంత ఎక్కువైతే అన్ని గొడవలు జరుగుతుంటాయి. సోషల్‌ మీడియాలో భార్యాభర్తలకు సంబంధించిన జోకులు, మీమ్స్, వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఈ వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతారు. తాజాగా భార్యా భర్తలకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.

కొంతమంది భార్యలు భర్తల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. వారిపై జాలి, దయలాంటివి అస్సలు చూపరు. ఇంట్లో వారు చేసే పనులను భర్తలతో చేయిస్తారు. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. వీడియోలో భర్త సోపాలో పడుకొని ఉంటాడు. అతడి దగ్గరకు భార్య వచ్చి అంట్లు తోమమని అడుగుతుంది. వెంటనే అతడు వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి పని పూర్తి చేస్తాడు. తర్వాత వచ్చి దుస్తులు ఇస్ట్రీ చేయమని అడుగుతుంది. ఆ పని కూడా చేస్తాడు.

ఆ తర్వాత బట్టలు ఉతుకమని ఫోర్స్ చేస్తుంది. ఆ పని కూడా చేస్తాడు. ఇలా పదే పదే ఏదో ఒక పని చెబుతూ ఉంటుంది. దీంతో విసుగెత్తిపోయిన భర్తకు ఓ తుంటరి ఆలోచన వస్తుంది. వెంటనే అతడు ఆమె నెయిల్‌ పాలిష్ తీసుకొని గోళ్లకు అప్లై చేయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అతడి భార్య మళ్లీ ఏదో ఒక పని చేయమని అడగడానికి వస్తుంది. వెంటనే అతడు నెయిల్‌ పాలిష్ వేసుకుంటున్నట్లు సైగ చేస్తాడు. ఎండిన తర్వాత మాత్రమే ఏదైనా చేస్తానని చెబుతాడు. దీంతో ఆమె నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇలా ఈ భర్త.. భార్య నుంచి తప్పించుకుంటాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హెప్‌గుల్ 5 అనే అకౌంట్‌ ద్వారా షేర్ చేశారు. వీడియో అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే 4 వేల మంచి చూశారు. ఫన్నీ ఎమోజీతో వీడియోపై తమ స్పందనను తెలియజేస్తున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. సీఎంగా రాజీనామా

Fake Currency: హైదరాబాద్‌ మహానగరంలో నకిలీ కరెన్సీ చలామణి గుట్టురట్టు.. మహిళతో సహా ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Tirumala Accident: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల కారుకి యాక్సిడెంట్.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు