Viral Video: వామ్మో వాటర్‌ ఫాల్స్‌లో అనకొండ.. బెంబేలెత్తిన జనం!

|

Feb 27, 2024 | 6:28 PM

సమ్మర్ వస్తుంది.. దీంతో చాలా మంది టూర్స్, ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సముద్రాలు, వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లి.. సేద తీరుతూ ఉంటారు. అక్కడున్న నీటిలో జలకాలాడుతూ ఉంటారు. నీటిలో సేద తీరుతూ.. వేడి నుంచి ఉపశమనం పొందుతారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు.. వాటర్ ఫాల్స్ లాంటి వాటి దగ్గరకు జనాలు పోటెత్తుతారు. ఇప్పుడు సమ్మర్‌లో ఎక్కడ చూసినా టూరిస్టులే ఎక్కువగా ఉంటారు. అలా ఓ వాటర్ ఫాల్స్‌లో జనం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే వాటర్ ఫాల్స్‌లో సడెన్‌గా..

Viral Video: వామ్మో వాటర్‌ ఫాల్స్‌లో అనకొండ.. బెంబేలెత్తిన జనం!
Viral Video
Follow us on

సమ్మర్ వస్తుంది.. దీంతో చాలా మంది టూర్స్, ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సముద్రాలు, వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లి.. సేద తీరుతూ ఉంటారు. అక్కడున్న నీటిలో జలకాలాడుతూ ఉంటారు. నీటిలో సేద తీరుతూ.. వేడి నుంచి ఉపశమనం పొందుతారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు.. వాటర్ ఫాల్స్ లాంటి వాటి దగ్గరకు జనాలు పోటెత్తుతారు. ఇప్పుడు సమ్మర్‌లో ఎక్కడ చూసినా టూరిస్టులే ఎక్కువగా ఉంటారు. అలా ఓ వాటర్ ఫాల్స్‌లో జనం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే వాటర్ ఫాల్స్‌లో సడెన్‌గా నెమ్మదిగా ఏదో కదులుతున్నట్లు అనిపించింది. సరిగ్గా చూస్తే వామ్మో భారీ అనకొండ.. స్లోగా వాటర్‌లో వెళ్తుంది. అది చూసిన జనం బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోయారు.

సాధారణంగా అనకొండ పేరు ఎత్తితేనే చాలా మంది ఒణికిపోతారు. అలాంటిది అంత భారీ అనకొండ కళ్ల ఎదుట ఉంటే.. చూసి నిజంగానే భయబ్రాంతులకు గురయ్యారు అక్కడి జనం. వెంటనే పైకి పరుగులు తీశారు. ఇంతసేపూ మనం అనకొండ ఉన్న నీటిలో స్నానం చేశామా అని షాక్ అయ్యారు. దీంతో భద్రతపై ప్రజల్లో భయాందోళన నెలకొంది. అనకొండ ఎవరికీ హాని చేయనప్పటికీ. ఈ వీడియోలో అనకొండ నీటిలోకి వెళ్లడం కనిపిస్తుంది. అనకొండ కడుపు నిండుగా ఉండడం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పలువురు అంటున్నారు.

దీంతో ఒక్కసారిగా అక్కడున్న జనం.. సెల్ఫీలు, వీడియోలు తీశారు. వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఎక్కడికి.. ఎప్పుడు జరిగింది అనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం నిజంగానే భయానికి గురి చేసింది. ఏది ఏమైనా ఎక్కడైనా వాటర్ ఫాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం ఈ వీడియో నైజీరియామ్యూజిక్ హ్యాండిల్‌ పేరుతో ఇన్ స్టాలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భయానక వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.