సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటెర్ నెట్‌ని షేక్ చేస్తుంది. తలపై ఫిష్ అక్వేరియాన్ని కూల్‌గా చేయించుకుంది ఈ మహిళ. సాధారణంగా కొన్ని వింత హెయిర్ స్టైల్స్ అన్నీ అబ్బాయిలే చేయించుకుంటూ ఉంటారు. కలర్స్ కలర్స్‌తో చూసేందుకు నిజంగానే విడ్డూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫిష్ అక్వేరియం హెయిర్ స్టైల్ చేయించుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ మహిళ. ఇంతకీ ఈ వీడియో ఏంటో చూసేద్దాం రకండి.
‘aheadhairmedia’ అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోల ఓ మహిళ సెలూన్‌లో కూర్చుని ఉంది. అక్కడి స్టైలిస్టులు ఆమె హెయిర్‌కు ఏవోవో రకరకాల జెల్స్ పూస్తున్నారు. చివరికి మహిళ తలపై ఓ పాత్ర ఆకారంగా మార్చారు. ఆ తర్వాత అందులో మరో వ్యక్తి నీటిని వేశాడు. అందులో చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి. ఆమె జుట్టులో ఆ చేప పిల్లలు చక్కగా ఈత కొడుతున్నాయి. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఈ వీడియోను ఇప్పటివరకూ మిలియన్ మందికి పైగానే చూశారు. 43 వేల లైక్‌లు కూడా అందుకుంది ఈ వీడియో. ఇక ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. రకరకాల కామెంట్లు పెడితూ.. వైరల్ వేస్తున్నారు. ‘లైక్స్ కోసమే ఈ హెయిర్ స్టైల్’.. ‘వావ్ ఇలా కూడా అక్వేరియం చేయవచ్చా’.. ‘ఇది నాకు అస్సలు నచ్చలేదు’.. ‘ఈ హెయిర్ స్టైల్ కంటే నా హెయిర్ స్టైలే బాగుంది’.. ‘ఈమె నిద్ర పోతుందా..?’ అంటూ ఫన్నీగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం ఈ వీడియో మాత్రం డిఫెరెంట్‌గా ఉంది. ఇలా కూడా ఫిష్ అక్వేరియం చేసుకోవచ్చా.. అని వీక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.