నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

సముద్రపు దిగ్గజాలుగా పిలవబడే తిమింగలాలు (Whales) తమ పిల్లలకు పాలు ఎలా ఇస్తాయనే ఆసక్తికరమైన, అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. నీటి అడుగున తిమింగలాలు పాలిచ్చే విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తిమింగలాలు క్షీరదాలు (Mammals) అయినప్పటికీ, నీటి అడుగున అవి తమ పిల్లలకు పాలు ఇచ్చే విధానం చాలా భిన్నంగా ఉంటుంది.

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!
Whale Nursing Process
Image Credit source: AI image

Updated on: Apr 23, 2026 | 10:10 PM

తిమింగలాలు చేపలు కావు, అవి నీటిలో నివసించే క్షీరదాలు. అంటే అవి పిల్లలకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచుతాయి. అయితే, సముద్రపు నీటిలో పాలు కలిసిపోకుండా తల్లి తిమింగలం తన బిడ్డకు పాలు ఎలా ఇస్తుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే.. చాలా క్షీరదాలకు పాలు తాగడానికి పెదవులు తోడ్పడతాయి. కానీ తిమింగలాలకు పెదవులు ఉండవు. అందుకే అవి పాలను నేరుగా పీల్చలేవు. ఈ సమస్యను అధిగమించడానికి తల్లి తిమింగలం శరీరంలో మెమరీ స్లిట్స్ (Mammary slits) అనే ప్రత్యేక భాగాలు ఉంటాయి. పిల్ల తిమింగలం తన నోటిని తల్లి దగ్గరికి చేర్చినప్పుడు, తల్లి తన కండరాల సహాయంతో పాలను బయటకు చిమ్ముతుంది.

పాలు నీటిలో ఎందుకు కలిసిపోవు?: సాధారణంగా పాలు నీటిలో కలిస్తే కరిగిపోతాయి. కానీ, తిమింగలం పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఇందులో కొవ్వు శాతం 50శాతం వరకు ఉంటుంది. ఇది ఎంత చిక్కగా ఉంటుందంటే, నీటిలో ఇది ఒక ముద్దలా లేదా వెన్నలా కనిపిస్తుంది. దీనివల్ల పిల్ల తిమింగలం ఆ పాలను నీరు కలవకుండానే ఆహారంగా తీసుకోగలుగుతుంది. తిమింగలం పాలలో పోషకాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల పిల్ల తిమింగలాలు చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని జాతుల తిమింగలం పిల్లలు రోజుకు సుమారు 90 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇంతటి శక్తివంతమైన ఆహారం వల్లే అవి సముద్రపు చలిని తట్టుకోగలవు.

ఇవి కూడా చదవండి

ప్రకృతి ప్రతి జీవికి తన మనుగడ కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఇచ్చింది. నీటి అడుగున తిమింగలాలు చేసే ఈ నరిసింగ్ ప్రక్రియ జీవవైవిధ్యంలోని ఒక అద్భుతం. ఇటీవల విడుదలైన డ్రోన్ వీడియోల ద్వారా ఈ దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా తెలిశాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us