Viral Video: బరాత్‌లో బాంబులు పేల్చారు.. సీన్ కట్ చేస్తే.. వరుడికి సీన్ సితారా అయింది.. వీడియో

సాధారణంగా పెళ్లిళ్ల ఊరేగింపులో గుర్రాలను వినియోగిస్తుంటారు. అయితే.. మేళతాళాలు, టపాకుల మోతకు గుర్రాలు బెదిరిపోయిన సంఘటనలను మనం అనేకం చూసుంటాం..

Viral Video: బరాత్‌లో బాంబులు పేల్చారు.. సీన్ కట్ చేస్తే.. వరుడికి సీన్ సితారా అయింది.. వీడియో
Wedding Video

Updated on: May 15, 2022 | 1:10 PM

Wedding Viral Video: సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. బరాత్ సమయంలో పటాకులు కాల్చడంతో భయపడిన గుర్రం.. పైన కూర్చొన్న పెళ్లి కుమారుడితో సహా అక్కడి నుంచి పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సాధారణంగా పెళ్లిళ్ల ఊరేగింపులో గుర్రాలను వినియోగిస్తుంటారు. అయితే.. మేళతాళాలు, టపాకుల మోతకు గుర్రాలు బెదిరిపోయిన సంఘటనలను మనం అనేకం చూసుంటాం.. ఇలాంటి సమయాల్లో గుర్రాలను నియంత్రించడం చాలా కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఊహించని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు గుర్రంపై కూర్చొని ఉన్నాడు. ఊరేగింపునకు అంతా సిద్ధమైంది. దీనికి ముందు వరుడి కుటుంబసభ్యులు కొన్ని పూజలు నిర్వహించారు. అయితే ఒకవైపు మేళ తాళాలకు ఆ గుర్రం బెదిరి ఉంది. మరోవైపు అక్కడ ఉన్నట్టుండి క్రాకర్స్‌ కాల్చారు. దీంతో మరింత బెదిరిపోయిన గుర్రం అక్కడి నుంచి పరుగులు తీసింది. దాని పైనే పెళ్లి కుమారుడు కూర్చొని ఉన్నాడు. దాని వెనుక నుంచి గుర్ర యజమాని సహా.. కుటుంబసభ్యులు కూడా పరుగులు తీశారు. ఊహించని ఈ ఘటనకు పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు, బంధువులు షాకయ్యారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఈ వీడియోను ‘ఘంటా’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిని ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా వీక్షించగా.. వేలాది మంది లైకులు చేశారు. దీంతోపాటు నెటిజన్లు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కొడుకు పరిస్థితి మాటల్లో వర్ణించలేనిదంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: సూపర్ ఉమెన్.. నీటిపై అద్భుతమైన స్టంట్లు చేసిన మహిళ.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే..

Rice Water for Hair: బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా.. అందులోని పోషకాలు తెలిస్తే అస్సలు ఒదిలిపెట్టరు..

High BP Control Tips: మందులు లేకుండానే హైబీపీ సమస్యకు ఇలా చెక్ పెట్టండి.. సింపుల్ టిప్స్ మీకోసమే..

Loading...
Unable to load recommendations.
Follow Us