Watch Video: కేఎఫ్‌సీలో ఇంటర్వ్యూ అంటే మాటలా..? చావు కోసం సిద్ధమవుతోన్న కోడిపుంజు.. ఎలా రెడీ అవుతుందో మీరే చూడండి..

Watch Video: నెటిజన్లను నవ్వించగలిగే అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తే ఎలాంటి టెన్షన్స్ నుంచి అయిన బయటపడడం ఖాయం. అలాంటి వీడియోలలో ప్రధానంగా పెట్స్, చిన్న పిల్లలకు సంబంధించినవే..

Watch Video: కేఎఫ్‌సీలో ఇంటర్వ్యూ అంటే మాటలా..? చావు కోసం సిద్ధమవుతోన్న కోడిపుంజు.. ఎలా రెడీ అవుతుందో మీరే చూడండి..
Hen Poses For Trimming

Updated on: Jun 11, 2023 | 12:27 PM

Watch Video: నెటిజన్లను నవ్వించగలిగే అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తే ఎలాంటి టెన్షన్స్ నుంచి అయిన బయటపడడం ఖాయం. అలాంటి వీడియోలలో ప్రధానంగా పెట్స్, చిన్న పిల్లలకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా మీ అబ్బురపరిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కేఎఫ్‌సీ ఇంటర్వ్యూ కోసం ఓ కోడిపుంజు హుందాగా రెడీ అవుతోంది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపడడంతో పాటు నవ్వేసుకుంటున్నారు.

ఆ వీడియోలో ఓ కోడిపుంజు ట్రిమ్ చేయించుకుంటుంది. అది ఎందుకు అలా ట్రిమ్ చేయించుకుంటుందో తెలియదు కానీ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ‘(కోడిపుంజు) బ్రోకి కేఎఫ్‌సీలో ఇంటర్వ్యూ వచ్చింది’ అన్నట్లుగా క్యాప్షన్ రాసుకొచ్చాడు. అంటే ఆ కోడి ఇంటర్వ్యూ కోసం నీట్‌గా కనిపించేందుకు అలా ట్రిమ్ చేసుకుంటుందన్నమాట. ట్రిమ్ చేయించుకోవడం పక్కన పెడితే.. సదరు వ్యక్తి ట్రిమ్మర్‌ని కోడిపుంజు మెడ కింద పెట్టినప్పుడు దాని ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఆ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి


వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ‘పాపం కోడి పుంజు కసాయివాడినే నమ్మింది’, ‘కేఎఫ్‌సీలో సెలెక్ట్ అయితే వచ్చేది ఉద్యోగం కాదు చావు’, ‘కేఎఫ్‌సీ కంటే మెక్‌డోనాల్డ్స్ బాగుంటుంది. అక్కడకు వెళ్లు’, ‘చావడానికి కూడా ఎంత నీట్‌గా రెడీ అవుతున్నావ్ కోడిపుంజు బ్రో’ అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు వందల సంఖ్యలో లైకులు, వేల మొత్తంలో వీక్షణలు లభించాయి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us