చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. బుడి బుడి అడుగులు వేస్తూ ఇళ్లంతా తిరిగే పిల్లలు ఇంట్లో ఉంటే మరింత జాగ్రత్త అవసరం.. ఎందుకంటే, ఈ వయసులో పిల్లలు వారి చేతికి దొరికిన వస్తువులను పట్టుకోవడం చేస్తుంటారు. నోట్లో పెట్టుకుంటారు. వారి ఆరోగ్యం, క్షేమంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నారులు కరెంట్ వస్తువులు, ఇంట్లో తినకూడని వస్తువులను నోట్లో పెట్టుకుని ప్రమాదాల బారినపడ్డ సంఘటనలు కూడా వార్తల్లో వింటుంటాం..అలాంటిదే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ చిన్నారి కీ చైన్‌ను మింగేసి తల్లిదండ్రులకు షాకిచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్‌లో రెండేళ్ల తొమ్మిదేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ తల్లిదండ్రులకు షాకిచ్చే పనిచేసింది. పిల్లవాడు తెలియకుండానే కీ చైన్‌ను మింగేశాడు. ఆ తర్వాత పిల్లాడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. పొట్టలో కీ చైన్ గాట్ల కారణంగా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కానీ, ఆ తల్లిదండ్రులకు ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు. పసివాడి ఆరోగ్య పరిస్థితి అధ్వాన్నంగా మారటంతో వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు. బాలుడిని పరిక్షించిన వైద్యుడు.. చిన్నారి కడుపులో కీ చైన్ ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చిన్నారికి ఎలాంటి సర్జరీ లేకుండా… బైనాక్యులర్స్ సహాయంతో కీ చైన్ తొలగించినట్టుగా వెల్లడించారు.
ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారులే అని అశ్రద్ధగా ఉండే.. తల్లిదండ్రులకు ఈ ఉదంతం ఓ హెచ్చరిక. పాప సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం, ఆపరేషన్ చేయకుండానే తాళం చెవి బయటికి రావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేదంటే..చిన్నారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..