Bullock Carts Wedding: ఈ మధ్యకాలంలో చిన్న శుభకార్యం జరిగినా.. కార్లల్లో వెళుతున్నారు. ఇక పెళ్లికి అయితే.. లగ్జరీ కార్లల్లో ఊరేగింపుగా వెళుతున్నారు. అయితే.. ఈ వరుడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు. పాత సంప్రదాయలను గుర్తిచేసేలా.. ఎండ్లబండిపై ఊరేగింపుగా వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా పాత సంప్రదాయాలను గుర్తుచేశాడంటూ కొనియాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వరుడు, తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పలు ఎండ్ల బండ్లపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లారు. డియోరియా జిల్లాలోని కుషరి గ్రామం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్రీ బజార్‌లోని వివాహ వేదిక చేరుకోవడానికి వరుడి కుంటుంబ సభ్యులు ఎండ్ల బండ్లను వినియోగించారు. దీంతో ఆయా ప్రాంతంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి ఈ ఊరేగింపును చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చారంటూ కొనియాడారు. అయితే.. డీజేకి బదులుగా ప్రజలు ఫరూహి జానపద పాటలకు నృత్యం చేస్తూ ఆనందంతో ముందుకుసాగారు.
వీడియో..
#WATCH | Deoria: Groom & the ‘baratis’ rode bullock-carts to reach wedding venue in Pakri Bazar from his home in Kushari village, a distance of 35-km today
“I wanted to show people how our ancestors used to take out wedding processions & perform weddings,” said groom Chhote Lal pic.twitter.com/v7pIsdpaON
— ANI UP (@ANINewsUP) June 20, 2021
ఈ సందర్భంగా వరుడు చోటేలాల్ మాట్లాడుతూ.. తమ పూర్వీకులు వివాహ ఉరేగింపు, వివాహాలు ఎలా జరుపుకునేవారో అన్నది ప్రజలకు తెలియజేసేందుకు ఎండ్ల బండ్లపై పెళ్లికి వెళ్లినట్లు తెలిపాడు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఒక సందేశాన్ని ఇచ్చామంటూ పేర్కొన్నాడు. అయితే.. పెళ్లి ఊరేగింపును చూసిన వారంతా మొబైల్ ఫోన్లు తీసుకుని రికార్డింగ్ చేసుకుంటూ కనిపించారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Also read: